Home » నేను హీరోని కాదు.. మెగా మేనల్లుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

నేను హీరోని కాదు.. మెగా మేనల్లుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

by Anji
Ad

హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఉప్పెన మూవీ సినిమాతొ సూపర్ హిట్ సాధించాడు. ఇక ఆ తరువాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆదికేశవ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

Advertisement

“మాస్‌ హీరో అవుదామని లేదు. నాకు తెలిసిందల్లా కష్టపడి నిజాయితీగా పనిచేసుకుపోవడమే. కథ, పాత్ర నచ్చితే సినిమా చేస్తాను. ఫలితం గురించి ఆలోచించను. తొలి సినిమా ‘ఉప్పెన’ కూడా అలాగే చేశాను. ఎవరైనా అడిగినా నేను హీరోను కాదు, నటుడ్ని మాత్రమే అని చెబుతాను. ‘హీరో అనిపించుకుంటే మంచి పాత్రలు చేయలేం. నటుడు అనిపించుకో.. విభిన్నపాత్రలు చేసే అవకాశం వస్తుంది’ అని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. ఆయన మాటే నాకు వేదవాక్కు ’ అని పంజా వైష్ణవ్‌ తేజ్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీలీల కథానాయిక. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘రంగరంగ వైభవంగా’ చిత్రీకరణ సమయంలో ఈ కథ విన్నాను. చాలా బాగా నచ్చింది.

Advertisement

తుదిమెరుగులు దిద్దాక ఇంకా బాగా వచ్చింది. ఇది మాస్‌ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. ఇందులో కామెడీ, సాంగ్స్‌, విజువల్స్‌, ఫైట్స్‌ అన్నీ బాగుంటాయి. యాక్షన్‌ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని దర్శకుడు సాధ్యమైనంత సహజంగా చిత్రీకరించాడు. కొడితే పదిమంది గాల్లో ఎగిరిపడటం లాంటివి ఇందులో ఉండవు. అన్నీ నాచురల్‌గా ఉంటాయి శ్రీలీలతో డ్యాన్స్‌ అంటే మాటలు కాదు. నేను స్వతహాగా డ్యాన్సర్‌ని కాదు. పట్టుదల మాత్రం ఎక్కువ. మీరు ఓకే అనేదాకా ఎంతైనా కష్టపడతాను అని మాస్టర్‌కి చెప్పాను. కానీ ఎంత కష్టమైనా మూమెంట్‌ అయినా రెండో టేక్‌లోనే ఓకే అయిపోయేది. శ్రీలీల కూడా బాగా కోపరేట్‌ చేసింది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు కూడా క్యూట్‌గా, సరదాగా, సహజంగా ఉంటాయి. శ్రీలీల పాత్రలోని అమాయకత్వం, తింగరితనంలోనుంచి దర్శకుడు శ్రీకాంత్‌ హాస్యం రాబట్టాడు. అలాగే సీనియర్‌ నటి రాధికగారితో కలిసి నటించడం మరపురాని అనుభూతి. జీవీ ప్రకాశ్‌కుమార్‌గారి పాటలు నేపథ్యం సంగీతం రెండూ అద్భుతంగా ఉంటాయి. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading