మెగా ఫ్యామిలీ హీరోలకు ప్రస్తుతం బ్యాడ్‌టైమ్ నడుస్తోందనే చెప్పాలి. దాదాపు ఈ ఐదు నెలల కాలంలో మెగా హీరోలు నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గానే నిలిచాయి. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్‌లతో ఫ్యాన్స్‌ను డిసపాయింట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ నుంచి ఇటీవలే విడుదలైన ఆదికేశవ మూవీ వరకు మెగా హీరోలు సినిమాలు దాదాపు వంద కోట్ల మేర నష్టాలను మిగిల్చినట్టు సమాచారం. అసలు ఆ సినిమాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
బ్రో :
పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన బ్రో మూవీ జూలై 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న వినోదయసిత్తం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ ఇమేజ్‌కు తగ్గ కథ కాకపోవడంతో బ్రో కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన బ్రో మూవీ థియేట్రికల్ రన్‌లో కేవలం 60 కోట్ల వసూళ్లను రాబట్టింది. 30 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.
భోళా శంకర్ :
Advertisement
బ్రో ఫ్లాప్‌ను మరువక ముందే భోళాశంకర్‌తో మెగా ఫ్యాన్స్‌కు పెద్ద షాకే తగిలింది. ఆగస్ట్ 11న రిలీజైన చిరంజీవి భోళాశంకర్ ఈ ఇయర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. మెగా స్టార్ క్రేజ్ కారణంగా భోళాశంకర్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. దాదాపు 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రిలీజైన 30 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. యాభై కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.
గాండీవధారి అర్జున :
ఇక అదే నెలలో రిలీజైన వరుణ్‌తేజ్ గాండీవధారి అర్జున కూడా భోళాశంకర్ రూట్‌లోనే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రెండు కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టి వరుణ్‌తేజ్‌కు పీడకలను మిగిల్చింది.
ఆదికేశవ :
ఇటీవలే రిలీజైన వైష్ణవ్‌తేజ్ ఆదికేశవ కూడా మెగా ఫ్లాప్‌లా లిస్ట్‌లో దాదాపు చేరిపోయింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. ఐదు రోజుల్లో ఈ సినిమా రెండు కోట్ల ఇరవై లక్షల వరకు వసూళ్లను రాబట్టింది. ఆదికేశవ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో ఏడు కోట్లకుపైగా వసూళ్ల రావాల్సివుంది. దాదాపు అది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఆదికేశవ కూడా నిర్మాతలకు ఐదు కోట్లకుపైనే నష్టాలను మిగిల్చే అవకాశాలు కనిపిస్తోన్నాయి.