తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అటు గత వారమే కందుకూరు టిడిపి సభలో ఏకంగా 8 మంది మృతి చెందారు. అయితే, వరుసగా గుంటూరు, కందుకూరు సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో, జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Advertisement
కందుకూరు, గుంటూరు సభల్లో విషాదాల తర్వాత రాష్ట్రంలో రహదారులపై, బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించారు. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపై, అలాగే మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని తెలిపింది ప్రభుత్వం. అయితే అత్యంత ఆరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు కచ్చితంగా షరతులతో అనుమతి ఇవ్వచ్చని మినహాయింపు ఇచ్చింది.
Advertisement
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, అలాగే నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగోంటున్నారని, అందుకే 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లను కేవలం ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలన్నారు అధికారులు. అలాగే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని అధికారులను సూచించారు.
READ ALSO : హైదరాబాద్ లో దారుణం.. ఆర్డర్ లేట్ గా తెచ్చాడని ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి