Home » May 6th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 6th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

స్టడీ టూర్‌కు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం, తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు రాహుల్‌ తెలుసుకోవాలి అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడి పథకాలను కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని కేటీఆర్ అన్నారు.

Advertisement

తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

నేడు శ్రీలంక బంద్‌కు రాజకీయ, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కొలంబోలో వాణిజ్య సంస్థలు, పెట్రోల్‌ బంక్‌లు ఇప్పటికే మూతపడ్డాయి. రాజపక్స రాజీనామా చేయాలని 24 గంటల పాటు నిరసన చేపడుతున్నట్టు ప్రకటించాయి.

ఏపీలో ఇంటర్ పరీక్షలు, పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలతో నేటి నుండి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్ ఫోన్ లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 10.01 లక్షల మంది విద్యార్ధులు పరిక్షలకు హాజరవుతున్నారు. 1,456 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Advertisement

ఐపీఎల్ 2022 లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 21 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం విజయం సాధించింది.

ఉక్రెయిన్ ఐక్య‌రాజ్య‌స‌మితి ఓటింగ్ విష‌యంలో భార‌త్ దూరంగా ఉండాల్సింది కాదంటూ డ‌చ్ రాయ‌భారి అన్నారు. దాంతో భార‌త రాయ‌భారి తిరుమూర్తి మాకు నీతులే చెప్పొద్దంటూ కౌంట‌ర్ ఇచ్చారు.

యూపీలోని బ‌దాన్ జిల్లాలో మ‌సీద్ పై స్పీక‌ర్ పెట్టుకునేందుకు స‌బ్ క‌లెక్ట‌ర్ ను అనుమతికోరారు. దానికి స‌బ్ క‌లెక్ట‌ర్ అనుమ‌తి నిరాక‌రించ‌డంతో ఇర్ఫాన్ అనే వ్య‌క్తి అల‌హాబాద్ కోర్టును ఆశ్ర‌యించారు. దాంతో మ‌సీద్ పై స్పీక‌ర్ లు పెట్టుకోవ‌డం ప్రాథమిక హ‌క్కు అంటూ కోర్టు తీర్పును ఇచ్చింది.

ట్విట్ట‌ర్ సీఈవోగా ప‌రాగ్ అగ‌ర్వాల్ ను త‌ప్పించారు. తాత్కాలిక సీఈవోగా ఎలాన్ మ‌స్క్ ఉన్నారు.త్వ‌ర‌లోనే ఎలాన్ మ‌స్క్ కొత్త సీఈవో ను ప్ర‌క‌టించనున్నారు.

ఏఆర్ రెహ‌మాన్ కుమార్తె ఖ‌తిజా త‌న పెళ్లి ఫోటోల‌ను నెట్టింట షేర్ చేసింది. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో లైవ్ సౌండ్ ఇంజ‌నీర్ గా ప‌నిచేస్తున్న రియాస్ దిన్ షేక్ ను ఖ‌తిజా వివాహం చేసుకున్నారు.

ఏపీలోని అన‌కాప‌ల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక పై సాయి అనే మాన‌వ‌మృగం దారుణానికి పాల్ప‌డింది. ప్ర‌స్తుతం బాలిక ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది.

Visitors Are Also Reading