తెలంగాణ వ్యాప్తంగా భజరంగ్ దళ్ ఆందోళనలు చేస్తోంది. భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలో వెల్లడించారు. దాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. గాంధీభవన్ ముందు భజరంగ్ దళ్ నేతలు హనుమాన్ చాలీసా పఠించనున్నారు.
హైదరాబాద్ జగద్గిరిగుట్టలో కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహ* చేసుకున్నాడు. పరీక్ష సరిగ్గా రాయలేదని తీవ్ర మనస్థాపంతో సాయికిరణ్ ఆత్మహ* చేసుకున్నాడు.
Advertisement
హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు ఎర్ర గంగిరెడ్డి హాజరయ్యారు. న్యాయస్థానంలో గంగిరెడ్డి లొంగిపోనున్నారు. వైఎస్ వివేకా కేసులో ఏ-1 నిందితుడిగా గంగిరెడ్డి ఉన్నాడు. బెయిల్ రద్దు చేసి కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది. 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
ఖమ్మం జిల్లా మంగలగూడెంలో దారుణం చోటు చేసుకుంది. దహన సంస్కారాల విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ నెలకొంది. ఏర్పాట్లు చేస్తుండగా మా భూమిలో పెట్టొద్దు అని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడ్డళ్లు, కర్రలతో పరస్పర దాడులు చేసుకోవడంతో దహనసంస్కారాలు ఆగిపోయాయి.
Advertisement
తమిళనాడు తిరునల్వేలి జిల్లా అంబాసముద్రంలో దారుణం చోటు చేసుకుంది. విచారణలో 17 ఏళ్ల బాలుడి దంతాలు పీకి ఏఎస్పీ చిత్రహింసలు పెట్టాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఏఎస్పీ బల్వీర్‌సింగ్ సహా ముగ్గురు పోలీసులపై కేసు నమోదయ్యింది.
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో అక్రమాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.64 లక్షలు సొంత ఖాతాకు మళ్లించారని ప్రొఫెసర్ రాణిని విధుల నుంచి తొలగించారు. నకిలీ సర్టిఫికెట్లతో 10 మంది ఉద్యోగాలు పొందారనే ఫిర్యాదుపై కేసు నమోదు నమోదయ్యింది.
నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. రూ.183.95 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా బీజేపీ, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. డాక్యానాయక్ నుంచి భగవంత్ కుమార్ పేపర్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. తన తమ్ముడు రవికుమార్ కోసం భగవంత్ కుమార్ పేపర్ కొనుగోలు చేసినట్టు సిట్ గుర్తించింది.