పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ మూవీ రానున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ రానప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మాత్రం చాలా సైలెంట్ గా జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మోకాలికి సర్జరీ చేయించుకొని న్యూయార్క్ లో రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ నవంబర్ సెకండ్ వీక్ లో ఇండియాకి రిటర్న్ అవ్వనున్నట్టు తెలుస్తోంది.
Advertisement
ప్రభాస్ భారత్ కి తిరిగి వచ్చిన తరువాత రెస్ట్ లేకుండా తన సినిమాల సంబంధించిన షూటింగ్ లో పాల్గొనాలని ప్లాన్ చేస్తున్నాడట. ముందుగా సలార్ ప్రమోషన్స్ మీద కాన్ సెంట్రేషన్ చేయనున్న ప్రభాస్ తరువాత మారుతి సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. ఈ మూవీ కోసం ఇప్పటికే రామోజీఫిలింసిటీలో ఓ భారీ సెట్ కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిందని సమాచారం అందుతోంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం వేస్తున్న ఈ భారీ సెట్ కి సుమారు రూ.4కోట్లు ఖర్చు చేస్తన్నారని సమాచారం. ఈ సెట్ లో షూట్ చేయనున్న యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని సినిమా యూనిట్ కాన్పిడెంట్ గా ఉందట.
Advertisement
అంతేకాదు ఈ మూవీలో ప్రభాస్ లుక్స్ డిఫరెంట్ గా ఉంటాయని.. ఇప్పటివరకు చూడని గెటప్ సెటప్ లో ప్రభాస్ కనిపిస్తాడట. ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీసేందుకు మారుతి ప్లాన్ చేశాడట. అంతేకాదు.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్టు సమాచారం. రొమాన్స్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ లైనప్ లో ఉన్న భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాల మధ్య రిప్రెషింగ్ గా అనిపిస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి మరీ.
మరికొన్ని సినిమా వార్తలను ఇప్పుడు మనం చూద్దాం. తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!