Home » Mar1st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar1st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీచైతన్య కాలేజ్‌లో స్టూడెంట్‌ ఆత్మహ* చేసుకున్నాడు. క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకొని ఫస్టియర్‌ విద్యార్థి సాత్విక్ ఆత్మహ* చేసుకున్నాడు. కాలేజ్‌ యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థులు… తల్లిదండ్రుల నిరసనకు దిగారు.

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. దాంతో శ్రీవారి దర్శనం నేరుగా జరుగుతోంది. నిన్న శ్రీవారిని 59,392 మంది భక్తులు దర్శించుకున్నారు.

తెలంగాణకు పంజాబ్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు.. నేటి నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

మరోసారి గ్యాస్‌ ధరలు పెరిగాయి. డొమెస్టిక్‌ సిలిండర్‌పై రూ.50 పెరగ్గా వాణిజ్య సిలిండర్‌ ధర రూ.350.50 పెరిగింది. హైదరాబాద్‌లో రూ.1,155కి వంట గ్యాస్‌ ధరలు చేరుకున్నాయి.

నేటి నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్‌ జరుగుతోంది. ఇండోర్‌ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో భారత్‌ నిలిచింది.

Advertisement

నేడు కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. బీర్కూర్‌లోని టీటీడీ దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు.

తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ వరకు ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. జాయినింగ్ ల పై దృష్టి పెట్టాలని…
అభ్యంతరాలు ఉంటే అధ్యక్షునికి చెప్పాలని కోరారు.

ఆర్టీసి ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసి ఉద్యోగులకు సైతం పీఆర్సీ అందిస్తామని ప్రకటించింది.

బీఆర్ఎస్ పార్టీ స్థాపన తరవాత మొదటిసారి పక్క రాష్ట్రం లో పోటీకి రెడీ అవుతోంది. మహారాష్ట్ర లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీచేయాలని అక్కడి బీ ఆర్ ఎస్ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

భద్రాద్రి రాముడి కళ్యాణం నేపథ్యం లో నేటి నుండి ఆన్ లైన్ లో టికెట్స్ ను జారీ చేయనున్నారు.

Visitors Are Also Reading