Home » క‌లిసొచ్చే క‌లానికి న‌డిసొచ్చే కొడుకు అంటే ఇదే..మ‌నోజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

క‌లిసొచ్చే క‌లానికి న‌డిసొచ్చే కొడుకు అంటే ఇదే..మ‌నోజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

మోహ‌న్ బాబు న‌ట‌వార‌సుడు మనోజ్ తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. మార్చి 3న మ‌నోజ్ తాను ప్రేమించిన భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. కేవ‌లం బంధువులు మ‌రియు కొంత‌మంది స‌న్నిహితులు వీరి వివాహానికి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

Advertisement

ఇక వీరి వివాహాన్ని మ‌నోజ్ సోద‌రి న‌టి మంచు ల‌క్ష్మి ద‌గ్గ‌రుండి జ‌రిపించారు. ఇక పెళ్లి త‌ర‌వాత మ‌నోజ్ త‌న భార్య‌తో క‌లిసి అత్త‌వారింటికి వెళ్లాడు. భూమా మౌనిక తాత‌గారి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతే కాకుండా తాజాగా వీరు తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్లారు. అక్క‌డ మీడియాతో మ‌నోజ్ మాట్లాడారు.

ALSO READ :విడిపోకూడదని అతని కాళ్లు పట్టుకొని మరీ బ్రతిమాలా.. సంగీత దర్శకుడు కోటి ఆసక్తికరవ్యాఖ్యలు..!

Advertisement

ఈ సంధ‌ర్బంగా రాజీకీయాల్లోకి వ‌స్తారా అంటూ మ‌నోజ్ ను మీడియా ప్ర‌శ్నించింది. దానికి మ‌నోజ్ రాజ‌కీయాల్లోకి రాను కానీ ప్ర‌జాసేవ చేస్తాన‌ని చెప్పారు. అంతే కాకుండా మౌనిక‌తో వివాహం త‌ర‌వాత తిరుమ‌ల రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. జీవితంలో ఎందులో అయినా ఓడిపోవ‌చ్చు కానీ ప్రేమ‌లో కాద‌ని చెప్పారు. ఈ రోజు మా ప్రేమ గెలిచింద‌ని అన్నారు.

మా నాన్నగారి ఆశీస్సులు అక్క స‌పోర్ట్….మా అత్తామామ‌ల ఆశీస్సులు ఉన్నంత‌వ‌ర‌కూ ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని అన్నారు.వ‌రుస‌గా షూటింగ్ లు ప్రారంభం అవుతున్నాయ‌ని త్వ‌ర‌లోనే షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు. బాబు నేను మౌనిక నూత‌న జీవితంలోకి అడుగుపెట్టాల‌ని అనుకుంటున్నామ‌న్నారు. క‌లిసొచ్చే కాలానికి న‌డిసొచ్చే కొడుకు పుడ‌తాడు అది ఇదేనేమో అంటూ వ్యాఖ్యానించాడు.

ALSO READ : చెత్త‌ప‌ని చేయాలంటూ బ‌ల‌వంతం….జ‌బ‌ర్ద‌స్త్ పై అన‌సూయ ఓపెన్ కామెంట్స్..!

Visitors Are Also Reading