Home » స్నేహం ప్రేమ‌గా…కాబోయే భార్య‌పై మ‌నోజ్ కామెంట్స్ వైర‌ల్..?

స్నేహం ప్రేమ‌గా…కాబోయే భార్య‌పై మ‌నోజ్ కామెంట్స్ వైర‌ల్..?

by AJAY
Ad

టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ త్వ‌ర‌లో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. మనోజ్ వినాయ‌క‌చ‌వితి సంధ‌ర్బంగా గ‌తేడాది ఓ వినాయ‌క‌మండ‌పానికి భూమా మౌనిక‌తో క‌లిసి వ‌చ్చాడు. ఆ స‌మయంలో ఇద్ద‌రూ కెమెరా కంట ప‌డ‌టంతో ఇద్ద‌రి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఆ రోజు నుండే ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇక ఇద్ద‌రికీ ఇప్ప‌టికే విడాకులు అయిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

మ‌నోజ్ కు ఇటీవ‌లే విడాకులు కాగా భూమా మౌనిక గ‌తంలోనే భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. అయితే వీరిగురించి మ‌రికొన్ని వార్త‌లు కూడా వినిపించాయి. మౌనిక వివాహం జ‌ర‌గ‌క ముందే మ‌నోజ్ తో ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌. కానీ రాజ‌కీయకార‌ణాల వ‌ల్ల మౌనిక తండ్రి వీరి పెళ్లికి నో చెప్ప‌డంతో పాటూ మౌనిక‌కు మ‌రొక‌రితో వివాహం జ‌రిపించారట‌. ఇక మౌనిక మొద‌టిపెళ్లిలో మ‌నోజ్ కనిపించిన వీడియోలు సైతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే మార్చి నెల‌లో ఈ జంట ఒక‌టి కాబోతున్న‌ట్టు గుసగుస‌లు వినిపిస్తున్నాయి. మార్చి మొద‌టి వారంలో పెళ్లి చేసుకోబోతున్నార‌ని అతి ద‌గ్గ‌రి బంధువులు మ‌రియు స్నేహితులు వీరి వివాహానికి హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయని ట‌క్. అంతే కాకుండా తాజాగా మ‌నోజ్ మౌనిక గురించి కొన్ని కామెంట్స్ చేశార‌ని వార్త‌లు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. తాము మంచి మిత్రులం అని ఆ త‌ర‌వాత స్నేహం ప్రేమ‌గా మారింద‌ని చెప్పార‌ట‌. క‌ష్ట స‌మ‌యాల్లో మౌనిక త‌న‌కు అండ‌గా నిల‌బ‌డింద‌ని అలాంటి వ్య‌క్తి జీవితంలోకి వ‌స్తే అదృష్ట‌మ‌ని మ‌నోజ్ చెప్పిన‌ట్టు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ALSO READ :ఆస్తిలో తారకరత్న వాటాను ఆ ట్రస్ట్ కు రాశారా… అలేఖ్య రెడ్డికి అన్యాయమేనా?

Visitors Are Also Reading