టీ-20 క్రికెట్ లో బౌండరీల మోత మోగాల్సిందే. ప్రధానంగా సిక్సర్ల హోరుతో ప్రేక్షకులకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంటారు ఆటగాళ్లు. పొట్టి ఫార్మాట్ గా పేరుగాంచిన టీ-20 క్రికెట్ లో ప్లేయర్స్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ.. భారీ సిక్సలర్లు కొడుతున్నారు. తుఫాన్ ప్లేయర్లుగా పేర్గాంచిన క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, పోలార్డ్, వార్నర్ వంటి హార్డ్ హిట్టర్ల మోతతో ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. వీరు అంతా ఆడింది 200 లోపు మ్యాచ్ లే. సిక్సుల్లో మాత్రం దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో చివరి ఓవర్ లో సిక్స్ లు కొట్టే విషయంలో అగ్రస్థానంలో ఎవరున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఐపీఎల్ హిస్టరీలో చివరి ఓవర్లలో ధోని కొట్టిన సిక్సర్ల ధాటికి ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని 20వ ఓవర్లో 53 సిక్స్ లు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. డెత్ ఓవర్లలో ఆడే విషయంలో ఎం.ఎస్.ధోని నిపుణుడిగా నిలిచాడు. ఐపీఎల్ లో 20 ఓవర్ లో 50కి పైగా సిక్సులు బాదిన ఏకైక బ్యాటర్ ధోని నిలిచాడు. ఈ ఐపీఎల్ లో జోష్ లిటిల్ బౌలింగ్ లో లెగ్ సైడ్ సిక్సర్ బాది రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చివరి ఓవర్ లో ధోని ఇప్పటివరకు 53 సిక్సర్లు బాదాడు.
Advertisement
Also Read : IPL 2023 : ధోనీ దెబ్బ మాములుగా ఉండదు మరి..జియో సినిమాను షేక్ చేశాడు !
ఎం.ఎస్ ధోని తరువాత పోలార్డ్ 33 సిక్సర్లు, ధోని సహచరుడు రవీంద్ర జడేజా 26, గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా 25, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 23 సిక్సర్లు బాదారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డులను పరిశీలించినట్టయితే.. వెస్టిండిస్ హార్డ్ హిట్టర్ గేల్ పేరిట నమోదు అయింది. గేల్ 142 మ్యాచ్ లలో 357 సిక్సులు బాది అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఏబీ డివిలియర్స్ 251, మూడో స్థానంలో రోహిత్ శర్మ 245, నాలుగో స్థానంలో 235, ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ 227 నిలిచారు.
Also Read : Ambedkar Statue: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం గురించి ఎవరికి తెలియని నిజాలు.. ఏంటంటే..?