Singer mangli:జానపద పాటలైన, భక్తి రస పాటలైన, మంచి ఊపున్నా పాటలైనా ఏ టైపు సాంగ్స్ అయినా సరే తన గొంతు నుంచి బయటకు వచ్చాయి అంటే ప్రతి ఒక్కరికి వినసొంపుగా, అవి ఒక్కసారి వింటే చిందేసే విధంగా ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు.. ఆమె గొంతు నుంచి జాలువారిన ఎన్నో పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతున్నాయి.. సాధారణ న్యూస్ యాంకర్ గా టీవీ రంగంలోకి అడుగుపెట్టిన మంగ్లీ ఎంతో కష్టపడుతూ జానపద పాటలు పాడుతూ , ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సింగర్ గా గుర్తింపు సాధించిందని చెప్పవచ్చు.
Advertisement
also read:టీవీ సీరియల్ అంటూ వారసుడు పై దారుణమైన ట్రోల్స్…. డైరెక్టర్ ఫైర్…!
ఆమె పాటలు పాడడమే కాదు డాన్సులు, మాటలు తన అందచందాలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది మంగ్లీ. ఈ మధ్యకాలంలోనే జగన్ ప్రభుత్వంలో టీటీడీలో ఒక కీలక పదవిని పొందింది. అలాంటి మంగ్లీ ప్రస్తుతం ఒక పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా వస్తుందట.. మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూసేద్దాం.. జానపదం నుంచి సినిమాల దాకా నిరంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్న మంగ్లీకి సినిమాలో ఛాన్స్ వచ్చిందంటూ ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది..
Advertisement
చక్రవర్తి చంద్రచూడ్ దర్శకత్వం వహిస్తున్న “పాదరాయ” అనే కన్నడ చిత్రంలో మంగ్లీ హీరోయిన్ గా చేయనుందట. ఇప్పటికే కన్నడలో అనేక పాటలు పాడిన మంగ్లీ పాదరాయ అనే చిత్రంతో పాన్ ఇండియా మూవీలో కథానాయకగా నటించినున్నట్టు సమాచారం అందుతోంది. ఈ చిత్రం 2013- 14 లో జరిగినటువంటి ఒక రియల్ సంఘటన ద్వారా తెరకెక్కుతోందట. నాగ శేఖర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. మరి ఇందులో మంగ్లీ హీరోయిన్ గా చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుందో, అబద్ధం ఎంత ఉందో తెలియాలంటే షూటింగ్ మొదలయ్యే వరకు వేసి చూడాల్సిందే.
also read: