Home » Mangalavaram Movie Review : మంగళవారం మూవీతో పాయల్ ఖాతాలో సక్సెస్ చేరినట్టేనా ?

Mangalavaram Movie Review : మంగళవారం మూవీతో పాయల్ ఖాతాలో సక్సెస్ చేరినట్టేనా ?

by Anji
Ad

Mangalavaram Movie Review in Telugu :   RX 100 మూవీతో తొలి ప్రయత్నంలోనే సినీ ప్రియులను మెప్పించాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమాతో నటి పాయల్ రాజ్ పుత్ కూడా తెలుగు వారికి దగ్గర అయింది. RX 100 తరువాత ఆమె కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి అంతగా సక్సెస్ కాలేదు. మరోవైపు దర్శకుడు అజయ్ భూపతి కూడా మహా సముద్రం మూవీతో చేదు ఫలితాన్ని అందుకున్నాడు. ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే లక్ష్యంతో పాయల్ తో కలిసి మంగళవారం మూవీని ముస్తాబు చేశాడు. ఇక ఈ సినిమాకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం చేయడం మంచి ప్లస్ అయింది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. అసలు మంగళవారం సినిమా కథ ఏంటి..?  ఈ సినిమా హిట్టా.. పట్టా..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

సినిమా : మంగళవారం

నటీనటులు : పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, దివ్వ పిళ్లై, రవీంద్ర విజయ్, అజ్మల్ అమీర్, చైతన్య  కృష్ణ తదితరులు. 

సంగీతం : అజనీష్ లోకనాథ్

ఎడిటింగ్ : మాధవ్ కుమార్ గుళ్లపల్లి

సినిమాటోగ్రఫీ : శివేంద్ దాశరథి

నిర్మాత : స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అజయ్ భూపతి

విడుదల తేదీ : నవంబర్ 17, 2023.

Mangalavaram Movie Story (కథ) : 

గోదావరి జిల్లాలోని మహాలక్ష్మీపురం గ్రామంలో వరుసగా రెండు జంటల ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. అది ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజునే ఇలా జరుగుతుంది. అయితే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటూ.. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తి ఆ ఊరి గోడలపై రాసిన రాతల వల్లే వారు ఆత్మ*హ**త్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులందరూ నమ్ముతారు. కానీ గ్రామానికి కొత్తగా వచ్చిన ఎస్సై మాయ( నందిత శ్వేత) మాత్రం అవి ఆత్మ*హ**త్యలు కాదని. .హ**త్యలు అని బలంగా నమ్ముతుంది. అది నిరూపించేందుకు ఆ శవాలకు పోస్టుమార్టం నిర్వహించాలని ప్రయత్నిస్తే ఆ గ్రామం జమిందారు ప్రకాశం బాబు (చైతన్య  కృష్ణ) అడ్డు చెబుతాడు. అతని మాటకు ఊరు కూడా మద్దతు ఇవ్వడంతో మొదటిసారి విరమించుకుంటుంది.రెండో జంట మరణించినప్పుడు మాత్రం ఊరి వాళ్లను ఎదిరించి పోస్టుమార్టం చేయిస్తుంది.

మరోవైపు ఆ గ్రామంలో గోడలపై రాతలు రాస్తున్నటువంటి ఆ అజ్ఞాత వ్యక్తి ఎవ్వరో కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతారు. మరీ ఆ గ్రామంలో జరిగేవి ఆత్మ*హ**త్యలా..? హ**త్యలా? ఈ మరణాల వెనుక ఉన్న లక్ష్యం ఏంటి..? వీటికి ఆ ఊరి నుంచి వెలివేయబడ్డ శైలజ అలియాస్ శైలు(పాయల్ రాజ్ పుత్)కి ఉన్న సంబంధం ఏంటి.? ఆ ఊర్లో జరిగే చావులకు ఫొటో గ్రాఫర్ వాసు(శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారుకు.. అతని భార్య(దివ్య పిళ్లై)కి ఏమైనా సంబంధం ఉందా ? శైలు చిన్ననాటి ప్రియుడు రవి కథ ఏంటి..? అనేది మిగతా కథ. 

Advertisement

Mangalavaram Movie Review : 

శైలు చిన్నతనం ఎపిసోడ్ తో సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు అజయ్ భూపతి. రవితో ఆమె చిన్నప్పటి ప్రేమకథ.. ఇంట్లో తండ్రితో పడే ఇబ్బందులు.. రవి కుటుంబ నేపథ్యం.. తొలి 15 నిమిషాలు వీటితోనే నడిపాడు. ఇక ఆ తరువాత కథ వర్తమానంలోకి వస్తుంది. మహాలక్ష్మీపురం గ్రామంలో ఉండే కొన్ని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ.. నెమ్మదిగా సినిమా ముందుకు సాగుతుంది. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే.. ఫస్టాప్ మొత్తం వరకు ప్రధాన పాత్ర కనిపించకున్నా.. అసలు కథ మొదలవ్వకున్నా ఎక్కడ బోరు కొట్టించకుండా కథను ముందుకు నడిపించారు. ఫస్టాప్ లో జరిగే మరణాలు.. వాటి చుట్టూ సాగిన డ్రామాను అద్భుతంగా తెరకెక్కించాడు. శైలు పాత్రకు సంబంధించి చిన్న ట్విస్ట్ తో ఫస్టాప్ ముగించడంతో సెకండాఫ్ పై భారీ అంచనాలను పెంచారు. ఇక సెకండాఫ్ విషయానికొస్తే.. అసలు కథను ప్రారంభించి ప్రతీ ఎపిసోడ్ తో ట్విస్ట్ ఇస్తూ ప్రతీ సీన్ ను ఎమోషనల్ గా మార్చారు.

ఫస్టాప్ తో పోల్చితే.. సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. కళాశాలలో శైలుకు.. ఇంగ్లీషు లెక్చరర్ మదన్ కి మధ్య నడిచే ప్రేమ కథ సోసో గా అనిపిస్తుంది. వీరి మధ్య వచ్చే సాంగ్ యువతను మెప్పించేలా ఉంటుంది. చివరి 45 నిమిషాలు ప్రతీ ట్విస్ట్.. సినిమాను సక్సెస్ ట్రాక్ కి తీసుకెళ్లారు. ముఖ్యంగా సినిమాను ముగించిన తీరు మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉంటుంది.  శైలు పాత్రలో పాయల్ ఒదిగిపోయింది. ఎస్సై పాత్రలో నందిత శ్వేతా సీరియస్లుక్ లో కనిపించింది. అజయ్ ఘోష్-లక్ష్మణ్ మధ్య వచ్చే కామెడీ బాగుంటుంది. జమిందారుగా  చైతన్య పాత్రను డిజైన్ చేశారు. అజనీష్ లోకనాథ్ సంగీతం సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లింది. అలాగే.. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ అనే చెప్పాలి. తల్లూరి ఆర్ట్ విభాగం పనితీరు.. గుళ్లపల్లి మాధవ్ కుమార్ ఎడిటింగ్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాను విజువల్ ఫీస్ట్ గా మార్చాయనే చెప్పవచ్చు. మొత్తానికి మంగళవారం మూవీ సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్ :

  • పాయల్ నటన
  • అజనీష్ సంగీతం
  • దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ
  • థ్రిల్లింగ్ గా అనిపించే ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్ :

  • నెమ్మదిగా సాగే కథనం
  • ముగింపు

రేటింగ్ : 2.75/5

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading