ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. అలాగే కొంతమంది తమ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరూ పెళ్లి, పిలల్లతో సరదాగా గడుపుతున్నారు. అయితే తాజాగా హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీ తో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మనోజ్ హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2017లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్ 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండో పెళ్లే.
Advertisement
మనోజ్ ని పెళ్లి చేసుకునే టైమ్ కే మౌనికకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ ప్రేమకు గుర్తుగా మరో బుజ్జాయి రాబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా మనోజ్ బయట పెట్టాడు. తన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నాడు. తన మామ, అత్తమ్మలు భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నట్లు ఎక్స్ లో మనోజ్ పేర్కొన్నాడు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!