Home » మంచు మనోజ్ భార్య శ్రీమంతం.. మంచు ఫ్యామిలీ లేకుండానే..?

మంచు మనోజ్ భార్య శ్రీమంతం.. మంచు ఫ్యామిలీ లేకుండానే..?

by Anji
Ad

మంచు వారబ్బాయి మంచు మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెల్సిందే. భూమా మౌనికను మనోజ్ ప్రేమించి, గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అంతకుముందే వేరేవారితో పెళ్లి అయ్యింది. భూమా మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును కూడా మనోజ్ యాక్సెప్ట్ చేశాడు. ఆ చిన్నారి బాలుడును శివుడు తనకు బహుమతిగా ఇచ్చాడని మనోజ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మధ్యనే బాబు బర్త్ డే ను ఆ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు.

Advertisement

ఇక మౌనిక తల్లి కాబోతుందని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి వీరిద్దరూ కూడా మీడియా ముందు కనిపిస్తూనే ఉన్నారు. వీరికి కవలలు అని వస్తున్న వార్తలను కూడా వారు ఖండించిన విషయం తెల్సిందే.  తాజాగా భూమా మౌనిక సీమంతం ఎంతో సింపుల్ గా జరిగింది. ఆళ్లగడ్డలోని తన పుట్టింటిలో మౌనిక సీమంత వేడుకలు ఎంతో సింపుల్ గా జరిగాయి. మనోజ్.. తన భార్యకు దగ్గర ఉండి సీమంతం జరిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ వేడుకలో మంచు కుటుంబం కనిపించకపోవడం గమనార్హం. చివరికి వీరికి పెళ్లి చేసిన మంచు లక్ష్మీ కూడా ఈ వేడుకలో కనిపించలేదు. మొదటి నుంచి వీరి పెళ్ళికి మంచు కుటుంబం సుముఖత చూపించలేదని వార్తలు వస్తూనే ఉన్నాయి.

Advertisement

 

కానీ, పెళ్ళిలో మోహన్ బాబు.. మౌనిక కూడా తన కూతురే అని చెప్పడంతో వీరు కలిసిపోయారు అనుకున్నారు. కానీ, మనోజ్.. మంచు కుటుంబం నుంచి బయటకు వచ్చేసాడని వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి తరువాత కూడా మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరిగిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం విష్ణు.. కన్నప్ప షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మంచు కుటుంబం ఈ సీమంతానికి వెళ్ళారా.. ? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Also Read :  పవన్ పై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్.. పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నా అంటూ..!

Visitors Are Also Reading