Home » మనసంతా నువ్వే “రీమా సేన్” కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వైరల్ అవుతున్న ఫొటోస్!

మనసంతా నువ్వే “రీమా సేన్” కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వైరల్ అవుతున్న ఫొటోస్!

by Srilakshmi Bharathi
Ad

వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమా మనసంతా నువ్వే. 2001 లో విడుదల అయిన ఈ సినిమా సంచలన విజయం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీమాసేన్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అదే ఏడాది గౌతమ్ వాసుదేవ్ డైరెక్షన్ లో ‘మిన్నెలే’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది.

Advertisement

తెలుగు, తమిళ్ మాత్రమే కాకుండా బెంగాలీ, కన్నడ భాషలలో కూడా ఆమె పలు చిత్రాలలో నటించారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆమె మనసంతా నువ్వే సినిమాతో గుర్తుండిపోయారు. ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గా నిలిచినా ఈ మూవీని ఇప్పటికి కూడా టీవీలోనో, యూట్యూబ్ లోనో పెట్టుకుని చూసేవారు కూడా ఉంటారు. రీమాసేన్ 1981 అక్టోబర్ 29న కోల్ కత్తాలో జన్మించారు. నటనపై ఉన్న ఆసక్తి కొద్దీ మోడలింగ్ లో అడుగుపెట్టిన రీమాసేన్ తక్కువ సినిమాలతోనే ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా నటించారు.

రీమాసేన్ 2012లో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత రీమా సేన్ సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. రీమాసేన్ ఫిబ్రవరి 22, 2013న పండంటి బాబుకి జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆ బాబు వయసు పదకొండు సంవత్సరాలు. రీమా సేన్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కానీ, ఎప్పుడైనా తన ఫ్యామిలీతో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలా రీసెంట్ గా తన ఫామిలీ ఫోటోలను రీమాసేన్ పంచుకున్నారు. వాటిల్లో ఆమె కొడుకు కూడా కనిపించడంతో రీమాసేన్ కు ఇంత పెద్ద వయసు ఉన్న కొడుకు ఉన్నాడా అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Visitors Are Also Reading