Home » ప్ర‌పంచంలోనే పొడ‌వైన సైకిల్.. గిన్నిస్ బుక్‌లో చోటు

ప్ర‌పంచంలోనే పొడ‌వైన సైకిల్.. గిన్నిస్ బుక్‌లో చోటు

by Anji
Ad

కొంద‌రూ వ్య‌క్తుల‌కు స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు చేయ‌డం అంటే చాలా ఇష్టం. అలాంటి వారు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. ముఖ్యంగా ఎవ‌రూ చేయ‌ని ఆవిష్క‌ర‌ణ‌లు వారు చేసి వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఆడ‌మ్ జ్ఞానొవిచ్ అనే వ్య‌క్తి కూడా ఇలాగే ఆలోచించి ప్ర‌పంచంలోనే అతి పొడ‌వు అయిన సైకిల్‌ను రూపొందించాడు. అయితే ఈ సైకిల్‌ను అత‌డు త‌యారు చేసిన ప‌ద్దతి తెలిస్తే మాత్రం విస్తుపోవాల్సిందే.. ఎందుకంటే అత‌డు వాడి పారేసిన‌టువంటి వ‌స్తుల‌తోనే ఈ సైకిల్‌ను త‌యారు చేయ‌డం గొప్ప విశేషం.

ప్రపంచంలోనే పొడవైన సైకిల్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు

Advertisement

Advertisement

ఆడ‌మ్ జ్ఞానోవిచ్ అనే వ్య‌క్తి రీ సైక్లింగ్ వ‌స్తువుల‌తో అతి పొడ‌వైన సైకిల్‌ను రూపొందించాడు. ఈ సైకిల్ 24 అడుగుల 3 అంగులాలు ఉన్న‌ది. అత‌డు ఈ సైకిల్‌ను రైడింగ్ చేస్తున్న దృశ్యాల‌ను గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డుల‌లో త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆడ‌మ్ జ్ఞానోవిచ్ ఏ దేశానికి చెందిన వ్య‌క్తి అనే విష‌యాన్ని గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డుల ప్ర‌తినిధులు ప్ర‌స్తావించ‌లేదు. ఈ సైకిల్‌ను చూసిన నెటిజ‌న్లు ఆడ‌మ్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఉన్నారు. త‌న‌కు ఎప్పుడూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయ‌డ‌మే ఇష్టం అని, త‌న ఆలోచ‌న‌లు ఎప్పుడూ పెద్ద స్థాయిలోనే ఉంటాయ‌ని పొడ‌వు అయిన సైకిల్ సృష్టిక‌ర్త ఆడ‌మ్ కామెంట్ చేసాడు.

Visitors Are Also Reading