ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెన్నై సూపర్ కింగ్స్ సాయం చేసింది. ఏపీ ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయి నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి వరకూ పోటీల నిర్వహణపై సీఎం జగన్ కు వివరాలు అందించారు అధికారులు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… ఈ ఆటలను అత్యంత ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహించాలని… కోరారు. చక్కటి స్ఫూర్తిని నింపేలా ఆటల పోటీలు సాగాలని చెప్పారు.
Advertisement
గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి ఇవి ఉపయోగపడాలన్నారు సీఎం జగన్. పోటీలకు వచ్చే క్రీడాకారులకు మంచి భోజనం సహా ఇతర సదుపాయాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ప్రముఖ క్రీడాకారులు అంతా ఈ పోటీల్లో భాగస్వామ్యం అయ్యేలా చూడాలని వివరించారు సీఎం జగన్.
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ సహా ఇతర క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని… విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం దిశగా అడగులు వేయాలని కోరారు. విశాఖపట్నంలో ఉన్న వైయస్సార్ స్టేడియంను క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేయాలని… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చిందని గుర్తు చేశారు సీఎం జగన్. కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలలో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు సీఎం వైయస్.జగన్.
ఇవి కూడా చదవండి
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు
అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !