మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కిరాణ దుకాణాలు, సూపర్ మార్కెట్‌లలో వైన్ అందుబాటులో ఉంచాలి అని నిర్ణయించారు. వెయ్యి చదరపు అడుగుల కంటే పెద్దదిగా ఉండే అన్ని సూపర్ మార్కెట్‌లలో అమ్మడానికి అవకాశం కల్పించారు. అక్కడ స్టాల్ ఏర్పాటు చేసి వైన్ విక్రయానికి అనుమతిస్తారు. అయితే పదేండ్ల క్రితం నాటి ప్రతిపాదన ఇది అని తెలిసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని కిరాణ దుకాణాలు, సూపర్ మార్కెట్లలో త్వరగా మద్యం అందుబాటులోకి రానున్నది. అయితే సూపర్ మార్కెట్‌లలో వైన్ మాత్రమే విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతించింది.
Advertisement
Advertisement
సీఎం ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో చర్చ కొనసాగింది. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడారు. రైతుల ఉత్పాదకతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ వివరాలను ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. సూపర్ మార్కెట్‌లోనే వైన్ విక్రయాలకు అనుమతిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి చదరపు అడుగుల వరకు ఉన్నా..వైన్ విక్రయాలకు అనుమతించనున్నట్టు నవాబ్ మాలిక్ చెప్పారు.
అదనంగా ద్రాక్ష రైతులు ఉత్పత్తిపై రాష్ట్ర నడుస్తోంది అని మాలిక్ పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు. సూపర్ మార్కెట్‌లో స్టాల్ షోకేస్ కానున్నది. గోవా, హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా బీజేపీ మద్యం విక్రయ విధానాన్ని అవలంభించింది. కానీ ఇక్కడ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.