Home » Maa Oori Polimera 2 Review : మా ఊరి పొలిమేర 2 రివ్యూ.. ఆ సీన్స్ అదుర్స్

Maa Oori Polimera 2 Review : మా ఊరి పొలిమేర 2 రివ్యూ.. ఆ సీన్స్ అదుర్స్

by Anji
Ad

Maa Oori Polimera 2 Review in Telugu :  సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే సినిమాలు వస్తుంటాయి. ఈ వారం ఒకేరోజు నాలుగు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. కీడాకోలా, విధి, నరకాసుర, పొలిమేర 2. వీటిలో సినిమాకు సంబంధించి ఫలితం ఏవిధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

నటీ నటులు : సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకెందు మౌళి, గెటప్ శ్రీను, సాహితి తదితరులు. 

దర్శకత్వం : అనిల్ విశ్వనాథ్ 

నిర్మాత : గౌరి  కృష్ణ

సంగీతం : గ్యానీ 

సినిమాటోగ్రాఫర్ : కె.రమేష్ రెడ్డి 

ఎడిటర్ : శ్రీ వారా 

Maa Oori Polimera 2  Story  కథ : 

మా ఊరి పొలిమేరకు ఇది సీక్వెల్. తొలిభాగం ముగిసిన వద్ద నుంచే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. కొమరయ్య (సత్యం రాజేశ్ ) గురించి నిజాలు తెలుసుకున్న లక్ష్మి (కామాక్షీ) ఏం చేసింది.? ఏ విధంగా పగ తీర్చుకోవాలనుకుంది.? కవిత ఎలా జీవించి ఉంది ? ఇలాంటి విషయాలు తెలియాలంటే మా ఊరి పొలిమేర 2 మూవీని థియేటర్లలో చూడాల్సిందే.  ఆసక్తికర కథనంతో పాటు ట్విస్టులు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో ట్విస్ట్ లే హైలెట్ అని చెప్పాలి. 

Maa Oori Polimera 2 విశ్లేషణ : 

Advertisement

ఈ సినిమాని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడనే చెప్పాలి. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల్లోనే స్టోరీ గురించి చెప్పేసి ప్రేక్షకుడిలో ఆసక్తికలిగించాడు దర్శకుడు. ఎలిమెంట్స్ తో సక్సెస్ కొట్టాలనుకొని అదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ఫస్ట్ పపార్ట్ లో ఉన్న మల్లేశంకి క్యారెక్టర్ కి సెకండ్ పార్ట్ లో ఉండే కొమురయ్య క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం చూస్తూ చాలా అద్భుతమనే చెప్పవచ్చు. హార్రర్ సినిమాగా చెప్పుకుంటున్నప్పటికీ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ మినహాయిస్తే.. మిగిలిన ఎక్కడ కూడా పెద్ద హార్రర్ కనిపించదు. సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతుంది. 

ప్రధానంగా ఈ సినిమాలో నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. సత్యం రాజేష్ తన క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా పోషించాడు. గతంలో సత్యం రాజేష్ కామెడీ సినిమాల్లో కామెడీ పాత్రలు చేసేవాడు. కానీ ఇప్పుడు టోటల్ ఇంప్రెషన్ మారిపోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేయాలని ఎప్పుడు ముందుంటాడు సత్యం రాజేష్. ఇలాంటి తరుణంలోనే ఈ మూవీలో దొరికిన మరో అద్భుతమైన అవకాశాన్ని చాలా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పవచ్చు. ఈ సినిమాలో క్లైమాక్స్ కాస్త స్లోగా సాగినప్పటికీ.. ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందనే చెప్పవచ్చు.  హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల కూడా అద్భుతంగా నటించింది. గెటప్ శ్రీను, బాలాదిత్య వాళ్ల పాత్ర పరిధి మేరకు వాళ్లు నటించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన  జ్ఞానీ తనదైన మ్యూజిక్ తో కొంత వరకు సినిమాకి హెల్ప్ చేశారనే చెప్పాలి. సినిమాటో గ్రాఫర్ రమేష్ రెడ్డి కూడా సినిమాకు తన విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. ఎడిటర్ కొన్ని షాట్స్ ని ట్రిమ్ చేయడంలో అంతగా ఆసక్తి చూపించలేదని స్పష్టంగా అర్థం అవుతోంది. 

ప్లస్ పాయింట్స్ : 

  • బ్యాక్ గ్రౌండ్ స్కోరు
  • ట్విస్ట్
  • దర్శకుడు
  • సత్యం రాజేష్
  • కామాక్షీ
  • స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ 

  • స్లో నేరేషన్
  • క్లైమాక్స్ స్లోగా సాగడం

రేటింగ్ : 2.75/5

Visitors Are Also Reading