ఎం.ఎస్. నారాయణ గురించి తెలియని వారుండరు. తనదైన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తాగుబోతు పాత్రల్లో ఎక్కువగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయేవారు. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలోని ఎం.ఎస్. చేసిన పలు కామెడీ సీన్లు ఆయన కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పవచ్చు. బాలకృష్ణ నటించిన సింహా సినిమా గెటప్ బాలయ్య కంటే ఎం.ఎస్. నారాయణకే బాగా సూట్ అయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా ఎం.ఎస్. నారాయణ కుమారుడు విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Advertisement
ఈ సందర్భంగా ఎం.ఎస్. విక్రమ్ మాట్లాడుతూ.. నటుడిగా చేసినంతవరకు హ్యాపీ అని తెలిపారు. రాబోయే రోజుల్లో పాత్రలే హీరోలు అయ్యే అవకాశముందని ఆయన చెప్పుకొచ్చారు. సీడీ, క్యాసెట్, రీల్ పోయి చిప్ వచ్చిందని ఎమ్మెస్ విక్రమ్ పేర్కొన్నారు. నేనెప్పుడూ గొప్ప అని ఫీలైతే బాధపడాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న దానితో నేను హ్యాపీ అని ఆయన కామెంట్లు చేశారు. సెలబ్రెటీల కొడుకులు కాకపోయి ఉంటే వాళ్లు తప్పకుండా పైకి వచ్చే వారేమో అని విక్రమ్ కామెంట్లు చేశారు.
Also Read : LIKE SHARE & SUBSCRIBE REVIEW : లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రివ్యూ.. ఈ సినిమా ఎలా ఉందంటే ?
Advertisement
బ్రహ్మానందం గారి అబ్బాయి ఆయన కొడుకు కాకపోయి ఉంటే ఈరోజు స్టార్ హీరో అయ్యేవాడేమో అని విక్రమ్ పేర్కొన్నారు. పెద్దపెద్ద స్టార్స్ ను చూస్తూ బ్రహ్మానందం గారి అబ్బాయిని ఎలా స్టార్ చేస్తారని ఇది అందరికీ వర్తిస్తుందని విక్రమ్ పేర్కొన్నారు. అలాకాకుండా సొంతంగా వస్తే క్లిక్ అయ్యేవాళ్ళమేమో అని ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కడికైనా వెళితే ఎమ్మెస్ గారి అబ్బాయి అని అంటారని వాళ్లు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి మేము ఈ పాత్ లో ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. మా నాన్న సక్సెస్ అయ్యాడు అని మాకు విచ్చలవిడిగా ప్రయాణం చేసే ఛాన్స్ లేదని ఆయన కామెంట్లు చేశారు. సినిమాల్లో సక్సెస్ కాకపోయినా ఇతర రంగాల్లో సక్సెస్ అయిన సెలబ్రెటీల కొడుకులు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read : రమాప్రభ కూతురిని పెళ్లాడిన టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తెలుసా ?
సాధారణంగా వచ్చేవాళ్లు ఏదైనా చేయగలరని మాకు అలా చేసే అవకాశం ఉందని విక్రమ్ కామెంట్లు చేశారు. నేను వేరు మా నాన్న వేరు కాదని మనకు ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటే అవుతామని ఆయన కామెంట్లు చేశారు. దాసరి గారు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారని ఆయన కొడుకుకు ఇండస్ట్రీ వల్ల ఏ బెనిఫిట్ కలిగిందని ఆయన తెలిపారు. దాసరి అరుణ్ బాగా కష్టపడ్డాడని ఎమ్మెస్ విక్రమ్ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
Also Read : ఊర్వశివో రాక్షసివో సినిమా రివ్వ్యూ…అల్లు శిరీష్ హిట్ కొట్టాడా..?