ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 15వ సీజన్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబయలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఇక 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాట్స్‌మెన్ తొలి నుంచి దుమ్ము రేపే పర్పార్మెన్స్ చూపెట్టారు. చెన్నై బౌలర్లకు చూపిస్తూ రెచ్చిపోయారు ఓపెనర్లు కే.ఎల్. రాహుల్, డికాక్.
Advertisement
Advertisement
వీరిద్దరూ కలిసి 99 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అందించారు. కే.ఎల్.రాహుల్ 26 బంతుల్లో 40 పరుగులు చేసి ఔట్ అవ్వగా.. డికాక్ 45 బంతుల్లో 61 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఆ తరువాత రెండు వికెట్లు పడి జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఎవిన్ లేవిస్, ఆయుష్ బదోని విజయం సాధించి మ్యాచ్‌ను ముగించారు. లేవిస్ 23 బంతుల్లో 55 పరుగులు చేశాడు. బదోని 2 సిక్సర్లతో మెరిపించాడు. కేవలం 9 బంతుల్లోనే 19 పరుగులు చేశాడు.
దీంతో నిర్ణిత 20 ఓవర్లలో 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది తొలి విజయం కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఇది రెండవ ఓటమి. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడిన లక్నో ఓటి పాలవ్వగా.. చెన్నై టీమ్ కోల్‌కతాతో తలపడి ఓటమి పాలైంది. రెండో మ్యాచ్‌లో కూడా ఓడిపోవడంతో అభిమానులు నిట్టూరుస్తున్నారు.