బీహార్‌లో ఓ ప్రేమ జంటకు ఊహించని ఘటనే ఎదురైంది. మైనర్లుగా ఉన్న అబ్బాయి, అమ్మాయి ఇరువురు తరుచూ కలుసుకునేవారు. ఈ తరుణంలోనే రెండు రోజుల కిందటే ఓ యువతి తన ప్రియుడిని కలిసేందుకు అతని ఇంటి వద్దకు వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో స్థానికులు పట్టుకుని గుడికి తీసుకెళ్లి కాళీమాత దేవాలంలో వారికి పెళ్లి జరిపించారు. అమ్మాయి మైనర్ అని తెలియక పెద్దు తప్పు చేయడంతో కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
వివరాల్లోకి వెళ్లితే.. బీహార్ లోని ముంగేర్ జిల్లా కాసిం బజార్ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.కాసింబజార్ మోక్బిరా నివాసి జితేంద్ర కుమార్ కుమారుడు ఆకాశ్ కుమార్ ని కలుసుకునేందుకు అతని ప్రియురాలు ఇతని ఇంటి వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించి వారు రహస్యంగా కలుసుకోవాలనుకున్నారు. వీరు కలుసుకోవడాన్ని స్థానికులు గమనించి.. ఇద్దరి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక ప్రియుడి ఇంటి వద్దకు వచ్చిన యువతిని ఎవ్వరూ ఏమిటి అని నిలదీయడంతో ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పడంతో దగ్గరలో ఉన్న కాళీ దేవాలయానికి తీసుకెళ్లి అమ్మవారి సమక్షంలో ఆకాశ్ కుమార్‌తో యువతికి పెళ్లి జరిపించారు.
మైనర్ బాలికకు యువకుని తరుపు బంధువులు గుడిలో పెళ్లి చేస్తుండగా కొందరూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి జరిగిన విషయాన్ని తెలుసుకున్న బాలిక తండ్రి గుడిలో చేసిన పెళ్లి చెల్లదు అని ప్రేమ పేరును అడ్డుపెట్టుకుని మైనర్‌గా ఉ్న తన కూతురికి బలవంతంగా పెళ్లి చేశారు అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక పెళ్లి చేసుకున్న ప్రేమ జంట ఇద్దరం ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం అని.. కలిసే జీవిస్తామని.. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. మైనర్‌కు పెళ్లి చేయడం నేరం కావడంతో ఆదిశగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Also Read :
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..?
అప్పుడు కౌన్ బనేగా కరోడ్ పతి…. ఇప్పుడు సివిల్స్ ర్యాంకర్..హైదరాబాదీ సక్సెస్ స్టోరీ!