Home » Aadhaar Link : ఇక ఆధార్ తో ఆస్తుల లింక్… బినామీలకు చెక్?

Aadhaar Link : ఇక ఆధార్ తో ఆస్తుల లింక్… బినామీలకు చెక్?

by Bunty
Ad

ప్రస్తుత కాలంలో ఆధార్ కచ్చితంగా ఉండాల్సిందే. అధికారికంగా జరిగే ప్రతి పనులకు ఆధార్ తప్పనిసరి. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులతో ఆధార్ అనుసంధానం జరుగుతుంది. తాజాగా ఆస్తులను కూడా అనుసంధానం చేయాలని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారా అక్రమార్కుల బినామీ ఆస్తులు బహిర్గతం అవుతాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఆస్తులకు కూడా ఆధార్ లింక్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు అయింది.

READ ALSO : కోహ్లీకి దెబ్బ మీద దెబ్బ! భారీ షాక్ ఇచ్చిన BCCI

Advertisement

అశ్విని ఉపాధ్యాయ అనే ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు కూడా మంచి నిర్ణయమని అభిప్రాయపడింది. దేశ పౌరుల స్థిర, చిరాస్థులకు సంబంధించిన పత్రాలను ఆధార్ తో అనుసంధానం చేయాలని దాఖలైన పిటిషన్ పై సోమవారం కేంద్రం నుంచి సమాధానం కోరింది కోర్టు. ఈ పిటిషన్ పై కేంద్రం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ చేతన్ శర్మతో పాటు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ మనీష్ మోహన్ లు కూడా ఇది ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.

Advertisement

READ ALSO :  తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..భర్తతో విభేదాలు పెరిగాయా?

 

ఈ పిటిషన్ ను విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం, ఈ అంశంలో నాలుగు వారాల్లో ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్ర ఆర్థిక, న్యాయ, గృహ-పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలకు సూచించింది. అయితే అవినీతి, నల్లధనం, బినామీ చెల్లింపులను ఆరికట్టేందుకు ఆధార్ తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై తదుపరి విచారణ జూలై 18 వ తేదీకి వాయిదా వేసింది.

READ ALSO : ఇంతకీ వైఎస్ భాస్కర్ రెడ్డి ఎవరు? జగన్ భార్య భారతికి ఏమవుతారు?

Visitors Are Also Reading