టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం లైగర్ సినిమా విడుదల కాబోతుంది. విజయ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ లైగర్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే విజయ్ దేవరకొండకు ఇక్కడ తెలుగులో ఎంత మంది ఫ్యాన్ ఉన్నారో చెప్పాల్సిన అవసరం లేదు. చేసినవి కొన్ని సినిమాలే అయినా అన్ని ప్రజలపై మంచి ఇంపాక్ట్ చూపించాయి.
Advertisement
అందుకే తెలుగులో విపరీతమైన క్రేజ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ పుట్టుకువచ్చారు. అందుకే ఇంత తొందరగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లిన కూడా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. లైగర్ కు వస్తున్న స్పందన చూసి బాలీవుడ్ కూడా షాక్ అవుతుంది.
Advertisement
అయితే ఈ రెస్పాన్స్ కారణంగానే ఈ లైగర్ సినిమా విడుదలకు ముందు భారీ బిజినెస్ చేస్తుంది. ఇక్కడ నైజం అంటే తెలంగాణ మొత్తంలో లైగర్ 25 కోట్ల ప్రీ బిజినెస్ అనేది చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఆంధ్రాలో ఇంతకంటే మూడు కోట్లు ఎక్కువ అంటే 28 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది. ఇక సీడెడ్ లో 9 కోట్ల బిజినెస్ చేసుకుంది లైగర్. విజయ్ దేవరకొండ యొక్క ఏ సినిమా కూడా గతంలో ఇంత బిజినెస్ చేయలేదు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రలో విడుదలకు ముందే 62 కోట్లు ఖాతాలో వేసుకుంది లైగర్.
ఇవి కూడా చదవండి :