శివమణి సినిమాలో సీసాలో లెటర్ దొరికే సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీన్ దర్శకుడి టాలెంట్ ను నిరూపించే విధంగా చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో ఆసిన్ తనను రక్షించాలంటూ లెటర్ రాసి సీసాలో పెట్టి పడేయగా ఆ సీసా రక్షిత దగ్గరకు చేరుతుంది. ఆ లెటర్ చదివిన రక్షిత దాన్ని ట్రాక్ చేసి లవర్స్ స్టోరీని వెలికితీస్తుంది. అయితే అచ్చం అలాంటి సీనే ఒకటి బయట కూడా జరిగింది. కాకపోతే అది లవ్ స్టోరీ కాదు. అది 29 ఏళ్ల క్రితం ఓ మహిళ రాసిన లెటర్ కావడం విశేషం. అసలు మ్యాటర్ లోకి వెళితే….మిరాండా చావెజ్ అనే 8ఏళ్ల బాలిక 1988 సెప్టెంబర్ 26వ తేదీన ఆమె అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న కొల్లెటాన్ కౌంటీ, ఎడిస్టో బీచ్ కు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లింది.
Advertisement
ఆ సమయంలో సరదాగా తాను బీచ్ కు ఎందుకు వచ్చాను..తాను చదువుతున్న స్కూల్ పేరు ఏంటి..తన పేరు ఏంటి తదితర వివరాలను రాసి ఓ సీసాలో బంధించి సముద్రంలో విసిరేసింది. అయితే సరిగ్గా 29 ఏళ్లు గడిచాక ఆ సీసా సముద్రంలో ప్రయాణించి లిండా హాంపైర్స్, డేవిడ్ అనే దంపతులకు ఐలాండ్ లో దొరికింది. ఇప్పుడు లెటర్ రాసిన మిరిండా వయసు 37 ఏళ్లు. ఇక ఈ సీసాలో లెటర్ ను చూసి ఆశ్చర్యపోయిన దంపతులు బయటకు తీసి చదవగా మిరిండా చావెజ్ వివరాలు ఉన్నాయి. ఆ వివరాల ఆధారంగా దంపతులు మిరిండాను ట్రాక్ చేసి ఛేజ్ చేశారు.
Advertisement
Also Read: యుద్దంలో భర్త మరణించాక…… ఆర్మీలో చేరిన భార్య.
అంతే కాకుండా ఆ లెటర్ ను దంపతులు ఫోటో తీసి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్ కాస్తా వైరల్ అయిపోయింది. అంతే కాకుండా ఆ పోస్ట మిరిండా వరకూ చేరింది. దాంతో ఆ మిరిండా తానేనని డేవిడ్ దంపతుకు చెప్పిన మిరిండా ఎంతో మురిసిపోయింది. ఆ లెటర్ దొరకడం చాలా సంతోషంగా ఉందని అదో మర్చిపోలేని జ్క్షాపకమని మిరిండా తెలిపింది. ఇక మిరిండా స్పందనతో ఆ పోస్ట్ మరింత వైరల్ అవుతోంది. చిన్ననాటి పెన్నులు పెన్సిల్లు కనిపిస్తేనే ఎంతో మురిసిపోతాం…అలాంటిది చిన్న వయసులో రాసిన లెటర్ మళ్లీ దొరికితే ఆ మాత్రం ఆనందం సహజమే…