టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన బజ్ బాల అప్రోచ్ ని చూసి డికెట్ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ మండిపడ్డారు. యశశ్వి జైస్వాల్ ఇంగ్లాండ్ ఆటను చూసి నేర్చుకోలేదని చురకలు అంటించాడు. పేదరికం జయించి ఒక్క అడుగు ముందుకు వేస్తూ అంతర్జాతీయ క్రికెటర్ గా యశస్వి జైస్వాల్ ని చూసి ఇంగ్లాండ్ ఆటగాళ్లు నేర్చుకోవాలని అన్నాడు. రాజ్కోట్ టెస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ డబల్ సెంచరీ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో యశస్వి శతకం పూర్తి చేసాక డకెట్ మాట్లాడుతూ.. అయితే ఇది తమకి గర్వంగా ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నాజర్ హుస్సేన్ ఘాటుగా స్పందించారు.
Advertisement
Advertisement
అతను ఇంగ్లాండ్ ను చూసి దూకుడుగా ఆడుతున్నాడని అర్థం వస్తుందని వాస్తవం ఏంటంటే అతనికి ఇంగ్లాండ్ ఏమీ నేర్పలేదు జీవితంలో ఏదైనా సవాళ్లు కష్టనష్టాలతో పాటు ఐపీఎల్ నుండి యశస్వి నేర్చుకున్నాడని అన్నారు. కనుక ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని ఈ బజ్బాల్ యుగంలో ఇంగ్లాండ్ మరింత మెరుగుపడాలంటే విమర్శలకు దూరంగా ఉండాలని వీలైతే యశస్విని చూసి ఏమైనా నేర్చుకోండి అని నాజర్ హుస్సేన్ అన్నారు.
టెస్టులో భారత్ 434 పరుగులు భారీ తేడాతో గెలిచింది. భారత్ విధించిన 557 పరుగుల లక్ష్య చేతనలో ఇంగ్లాండ్ 122 పరుగులకే అవుట్ అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జడేజా కి వచ్చింది ఐదు వికెట్లతో ఇంగ్లాండు పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసిన ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 430/4 వద్ద డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 319 పరుగులు కి కుప్పకూలిపోయింది ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో భారత్ పైన వుంది. ఇరు జట్ల మధ్యన నాలుగో టెస్ట్ శుక్రవారం నుండి రాంచి లో మొదలు కాబోతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!