సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దాదాపు 6 ఏళ్ళ తరువాత మళ్ళీ డైరెక్టర్ గా భాధ్యతలు తీసుకుంది. అది కూడా తన తండ్రి సినిమానే .. ‘లాల్ సలామ్’. తమిళ హీరో విష్ణు విశాల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుంటే రజినీకాంత్ ‘మొయ్దీన్ భాయ్’గా ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ చేస్తున్నారు . అలాగే భారత్ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత రాజశేఖర్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన క్యారక్టర్స్ లో నటిస్తున్నారు .ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక నేడు రజిని బర్త్ డే కావడంతో ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేశారు.
Advertisement
ఈ టీజర్ ని యాక్షన్ పార్ట్ తో కట్ చేశారు. రజిని యాక్షన్ సీన్స్ కి ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన సంగీతం బ్లాక్ బాస్టర్. మొత్తం నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ ఆడియన్స్ ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే.. సినిమా హిందు, ముస్లిం గొడవల కథాంశంతో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ హిందూ ముస్లిం గొడవలకు స్పోర్ట్స్ టచ్ ఇస్తూ ఐశ్వర్యా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉంటుందని తెలిపారు. ఇక జైలర్ ను మించిన కలక్షన్లు రాబట్టాలనే ఈ మూవీ టీం టార్గెట్.
Advertisement
ఇక రజినికాంత్ నటిస్తున్న మరో సినిమా ‘తలైవర్ 170’ అప్డేట్ ని కూడా నేడు బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చారు. ‘జై భీమ్’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ‘వేటైయాన్’ అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. ‘వేటైయాన్’ అంటే ‘హంటర్’ అనే మీనింగ్ వస్తుందట. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ అయితే సూపర్ ఉంది. ఇక ఈ సినిమాలో కూడా రజిని పోలీస్ గానే కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షన్.. వంటి పెద్ద క్రూ ఉన్నారు. నెక్స్ట్ రెండు ప్రాజెక్ట్స్ రజినీ కాంత్ రేంజ్ ను మరింత పెంచుతాయంటున్నారు ఫ్యాన్స్ . ఏ రేంజ్ కలక్షన్లు వస్తాయో వేచి చూడాలి మరీ.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!