ప్రస్తుత జనరేషన్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం ఎన్టీఆర్ ది. ఆయన షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే కానీ ఫ్యామిలీ కి ఎలాంటి ఇంపార్టెంట్ ఇస్తారో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన భార్య పిల్లలు అంటే ప్రాణమని చెబుతుంటారు. అయితే తన కుటుంబ సభ్యులను మాత్రం ఎప్పుడూ మీడియాకు దూరంగానే ఉంచుతారు ఎన్టీఆర్. ఏదైనా పండుగలు ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో మాత్రమే వారు కనిపిస్తూ ఉంటారు. ఇక మిగతా సమయాల్లో మాత్రం వారు కనిపించడం చాలా కష్టం. అయితే ఇటీవల కాలంలో మాత్రం లక్ష్మీ ప్రణతి తో టీ తాగుతున్న ఒక ఫోటో వైరల్ కాగా..
Advertisement
ఇందులో ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ వారి యొక్క స్వీట్ మెమోరీస్ క్రియేట్ చేసుకుంటున్నారట. ప్రస్తుతం ఆ పిక్ చాలా వైరల్ గా మారింది.. ఈ తరుణంలోనే వారి పెళ్లికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్నారు. నందమూరి దగ్గర బంధువు అయిన లక్ష్మీ ప్రణతి ని పెళ్లాడాడు ఎన్టీఆర్. వీరిద్దరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.. లక్ష్మీ ప్రణతి అందచందాల గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఆమె తన కట్టుబొట్టు ఎన్టీఆర్ గౌరవాన్ని మరింత పెంచుతూ వస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వారి పేర్లు అభయ్ రామ్,భార్గవ్ రామ్ ఎన్టీఆర్ ది అరేంజ్డ్ మ్యారేజ్..
Advertisement
వీరిద్దరూ బంధువులు కావడంతో వీరు తరచూ పెళ్లికి ముందే ఫోన్లలో కూడా మాట్లాడుకునే వారట. అయితే ఫోన్లో మాట్లాడే సమయంలో లక్ష్మీప్రణతి ఎన్టీఆర్ కు చాలా కండీషన్స్ పెట్టిందట.. అది ఏంటయ్యా అంటే.. పెళ్లి తర్వాత సినిమాల్లో మీరు ఎంత బిజీగా ఉన్నా కాస్త సమయం మాత్రం ఫ్యామిలీ కోసం కేటాయించాలని ప్రణతి చెప్పిందట. అలాగే వివాహం అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లడం తగ్గించాలని, అలాగే తారక్ ఫుడ్ విషయంలో కూడా లక్ష్మీ ప్రణతి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని తెలుస్తోంది.. ఈ విధంగా వివాహానికి ముందే ఎన్టీఆర్ కు కండిషన్లు పెట్టింది లక్ష్మీప్రణతి.
also read: