అల్‌ఖైదా ఉగ్రవాది, అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతలో కీలక సూత్రదారి అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ గురించి తెలియని వారుండరు. దాదాపు దశాబ్ద కాలం పాటు అమెరికా వెంటాడి పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో అంతమొందిచింది. ఇదిలా ఉండగా.. ఓ ప్రభుత్వ అధికారి తన కార్యాలయంలో ఏకంగా ఒసామా బిన్ లాడెన్ ఫోటోను పెట్టుకుని దాని కింద ప్రపంచ అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్‌గా అభివర్ణిస్తూ.. ఫోటో ఉంచాడు.
Advertisement
ఇది ఎక్కడో పాకిస్తాన్, అప్ఘనిస్తాన్‌లో కాదండోయ్.. మన భారతదేశంలోనే కావడం విశేషం. భారత్‌లో ఉత్తరప్రదేశ్ లో ఓ విద్యుత్ అధికారి నిర్వాహకంతో ఇలా చేయడంతో.. ఈ విషయం ఆ నోటా ఈనోటా పడి సోషల్ మీడియా వద్దకు వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక సదరు అధికారిని వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. యూపీలోని దక్షిణాంచల్‌లో విద్యుత్ విత్రన్ నిగమ్ లిమిటెడ్‌లో పని చేసే సబ్ డివిజనల్ ఆఫీసర్ రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ కార్యాలయంలో లాడెన్ ఫోటోను ఏర్పాటు చేశాడు. ఈ విషయం ఉన్నతాధికారుల చెవిలో పడడంతో రవీంద్ర ప్రకాశ్ గౌతమ్‌ను సస్పెండ్ చేశారు.
Advertisement
ఇక కార్యాలయంలో నుంచి ఆ ఫోటో తొలగించి.. గౌతమ్‌ను సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ సంజయ్ కుమార్‌సింగ్ వెల్లడించారు. సస్పెండ్ అయిన తరువాత కూడా రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ అసలు తగ్గలేదు. తన చర్యలను సమర్థించుకున్నాడు. ఫోటో ఎవరిదైనా కావచ్చని.. ఒసామా ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్ అని చెప్పాడు. నా దగ్గర అనేక కాపీలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read :
మరో సారి మెగా ఫ్యామిలీ ని గెలికిన వర్మ.. ! చిరంజీవి కష్టపడితే పైకి రాలేదు అంటూ సెటైర్లు
భార్య, భర్తలు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఈ మూడు కారణాలే విడిపోవడానికి కారణమట !