వెంకటేష్,చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్ర హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కుష్బూ.. ఇప్పటికీ తరగని అందంతో అభిమానులను అలరిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన చాలా విషయాలను ధైర్యంగా బయటపెడుతుంది కుష్బూ. తాజాగా ఈమె ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. అదేంటో చూద్దాం.. ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న లైం*క వేధింపులపై రియాక్ట్ అయింది సీనియర్ నటి బిజెపి నాయకురాలు కుష్బూ..
Advertisement
Also Read:నిశ్చితార్థం తర్వాత తమ పెళ్లిని రద్దు చేసుకున్న 10 మంది సినీ నటులు వీరే..!
తాను లైం**క వేధింపులు ఎదుర్కొన్నానని షాకింగ్ సీక్రెట్స్ బయట పెట్టేసింది. అది కూడా తన తండ్రి నుంచే లైం*గా వేధింపులు ఎదుర్కొన్నానని, కానీ ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇలా వేధింపులకు గురయ్యారని, కానీ 15 సంవత్సరాలు వచ్చాక తన తండ్రిని ఎదిరించానని తెలియజేసింది. ఇక నాకు పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడు నా తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయారని అన్నది. లైం**క వేధింపులపై కుష్బూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement
Also Read:ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే.?
ముంబై నగరంలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన కుష్బూ బాలనటిగా ఇండస్ట్రీ లోకి వచ్చింది. కలియుగ పాండవులు అనే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో వెంకటేష్ సరసన నటించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఒక నటి గా కొన్నాళ్లు చక్రం తిప్పింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రాణిస్తూనే బుల్లితెరపై కూడా కుష్బూ రాణిస్తోంది. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి , ముందుగా డీఎంకే పార్టీలో చేరి, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి, ప్రస్తుతం బిజెపి పార్టీలో కీలక నాయకురాలిగా కొనసాగుతోంది.
తాజాగా కుష్బూ సుందర్ కి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కుష్బూను అపాయింట్ చేసింది. ఈ విధంగా కుష్బూ ఓవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ముందుకు వెళ్తోంది. ఇంత బిజీ ఉన్న తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది కుష్బూ.
Also Read:పదో తరగతి బాలుడితో టీచర్ జంప్….కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్…!