దర్శకుడు లింగుస్వామి తనను బాగా ఇబ్బంది పెట్టాడు అని హీరోయిన్ కృతిశెట్టి పేర్కొన్నారు. అయితే తెలుగులోకి కృతిశెట్టి ఉప్పెన అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడం వల్ల కృతిశెట్టికి ఉప్పెనల ఆఫర్స్ అనేవి వచ్చాయి. దాంతో ఈ బెబ్బమ్మ చాలా బిజీగా మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. ఇక ఆ సినిమాలు అన్ని సూపర్ హిట్ కావడం ఆమె క్రేజ్ అనేది అంతకంతకు పెరుగుతూనే పోతుంది. దాదాపుగా ఇప్పటివరకు కృతిశెట్టి నటించిన అన్ని సినిమాలు హిట్ కావడంతో ఆమెతోనే సినిమాలు చేయడానికి హీరోలు ఇష్టపడుతున్నారు.
Advertisement
ప్రస్తుతం కృతిశెట్టి చాలా సినిమాల్లో చేస్తుంది. అందులో ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ఏదైనా ఉంది అనే ”ది వారియర్”. రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా రామ్ కు జత కడుతుంది. ఇక ఈ సినిమాకు తమిళా దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదల కాబోతుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో కృతిశెట్టి మాట్లాడుతున్న లింగుస్వామి వల్ల ఇబ్బందులు పడ్డాను అని పేర్కొంది. అయితే నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చెయ్యడం వల్ల తెలుగు బాగా మాట్లాడుతాను అని కృతిశెట్టి చెప్పింది.
Advertisement
అయితే మా డైరెకర్ లింగుస్వామి కూడా తెలుగు మాట్లాడుతారు. కానీ అఆయన అందులో తమిళ యాసను కలుపుతారు. అందుకే నాకు ఆయన మాట్లాడే తెలుగు అనేది అస్సలే అర్ధం కాలేదు. మొదటి వారం రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. అయితే రామ్ కు తమిళ్ బాగా వచ్చు. అందుకే ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని రామ్ నాకు వివరించేవాడు. అందుకే మెల్లిమెల్లిగా నాకు లింగుస్వామి గారి యాస అనేది అర్ధం అయ్యింది అని కృతిశెట్టి పేర్కొంది. ఇక రామ్ కెరియర్ లో మొదటి తమిళ సినిమ వస్తున్న ది వారియర్ ఏం చేస్తుంది అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :