Telugu News » Blog » నేను చెప్పను అని ఇంగ్లిష్ మీడియాకు చెప్పిన భువనేశ్వర్…!

నేను చెప్పను అని ఇంగ్లిష్ మీడియాకు చెప్పిన భువనేశ్వర్…!

by Manohar Reddy Mano
Ads

భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ టూర్ లో మొదట టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన ఇప్పుడు జరుగుతున్న టీ20 సిరీస్ లో మాత్రం దుమ్ము దులుపుతుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లలో భారీ పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల ఈ సిరీస్ ను 2-0 తో సొంతం చేసుకుంది. ఇక మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ ఓ కూడా గెలిచి ఇంగలను ను ఇంగ్లాండ్ లో వైట్ వాష్ చేయాలనీ భావిస్తుంది భారత జట్టు. అయితే ఇప్పుడు ఇండియా సాధిస్తున్న ఈ విజయాలలో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషితున విషయం తెలిసిందే.

Advertisement

అయితే భువీ ఎటువంటి బౌలర్ అనేది అందరికి తెలుసు. మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా కలిగి ఉన్న కూడా… గాయాల కారణంగా ఆడలేకపోతున్నాడు. సరైన ఫిట్నెస్ అనేది లేకపోవడంతో భువీ చాలా మ్యాచ్ లలో ఆడలేకపోయాడు. ఏదో ఒక్క మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయపడటం ఆ తర్వాత రెండు మూడు నెలలు జట్టుకు దూరం కావడం మళ్ళీ వచ్చిన ఒక్క సిరీస్ ఆడి గాయంతో మళ్ళీ వెళ్లిపోవడం ఇదే ఎక్కువగా గత మూడేళ్ళుగా భువీ కెరియర్ లో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత నుండు భువీ మంచి స్వింగ్ లో ఉన్నాడు.

Advertisement

ఇక ఇంగ్లాండ్ లో కూడా అదే ఫామ్ న కొనసాగిస్తున్న భువీ.. నిన్నటి మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. అక్కడ కూడా భువీని ఈ గాయాల గురించి ప్రశ్నించగా.. దానికి నేను సమాధానం ఇవ్వను అని చెప్పేసాడు. ఇక్కడే కాదు నేను ఇండియాలో కూడా నన్ను ఎవరైనా ఈ ప్రశ్న అడిగిన సమాధానం ఇచ్చేవాడిని కాదు అని పేర్కొన్నాడు. ఇక ఇంగ్లాండ్ పిచ్ ల గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఇంగ్లాండ్ లో పిచ్ లు అనేవి పేసర్లకు బాగా సహకరిస్తున్నారు. బాగా స్వింగ్ అనేది అవుతున్నాయి. గతంలో ఇలా జరగలేదు అని భువీ పేర్కొన్నాడు.

Advertisement

ఇవి కూడా చదవండి :

జింబాబ్వేకు భారత జట్టు.. ఇంకో కొత్త కెప్టెనా..?

వివో పై ఈడీ దాడులు.. కోహ్లీకి గట్టి షాక్..!