సాధారణంగా ప్రస్తుతం వెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్నీమధ్య మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ పెళ్లి కూడా జరగనుంది. ఇప్పుడు ఓ తెలుగు సీరియల్ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల ముందు నిశ్చితార్థం చేసుకుని, కాబోయే భర్తను పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు అతనితో ఏడడుగులు వేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఎవరిని పెళ్లి చేసుకుంది?
Advertisement
తెలుగు సీరియల్స్ కి సినిమాలకున్నంత క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలా కృష్ణ ముకుందా మురారీ సీరియల్ తో తెలుగమ్మాయి ప్రేరణ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమే పుట్టింటి హైదరాబాద్ లోనే అయినప్పటికీ.. పెరిగిందంతా బెంగుళూరులో. యాక్టింగ్ పై ఇష్టంతో పలు కన్నడ సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో ఈ సీరియల్ తో హీరోయిన్ అయిపోయింది. క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసులు గెలిచుకున్న ఈ చిన్నది ఎప్పుడు శ్రీపాద అనే కుర్రాడిని పెళ్లి చేసుకుంది.
Advertisement
అక్టోబర్ చివరలో నిశ్చితార్థం చేసుకున్న నటి ప్రేరణ ఇప్పుడు కన్నడ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమే నటి, కానీ భర్తకి మాత్రం ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు ఉంది. కాకపోతే అతడి హీరోలానే హ్యాండ్సమ్ గా ఉన్నాడు. దీంతో సీరియల్ అభిమానులు కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు.
మరిన్ని టాలీవుడ్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!