సీనియర్ హీరోలు కృష్ణ, ఎన్టీఆర్ మధ్య కొంతకాలం పొలిటికల్ వార్ ఉందనేది కాదనలేని నిజం. సూపర్ స్టార్ కృష్ణ 1984వ సంవత్సరంలో రాహుల్ గాంధీ పిలుపుమేరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతే కాకుండా ఎన్నికల్లో ఎన్టీఆర్ కు వ్యతిరేఖంగా ప్రచారం కూడా చేశారు. 1984 డిసెంబర్ 18న కృష్ణ తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సంధర్బంగా కృష్ణ మాట్లాడుతూ…ఎన్టీఆర్ చాలా స్వార్దపరుడని అన్నారు. పిల్లికి కూడా బిచ్చం పెట్టని వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ఫైర్ అయ్యారు.
Advertisement
అంతే కాకుండా కృష్ణ మాట్లాడుతూ….మద్రాస్ లో దొంగల బండి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇందిరా గాంధీపై దాడి జరిగిన విషయం తనకు తెలిసిందని అన్నారు. దాంతో షూటింగ్ కొనసాగించడానికి మనసు ఒప్పుకోక క్యాన్సిల్ చేసి ఇంటికి వెళ్లిపోయానని చెప్పారు. మద్యాహ్నం 2 గంటల సమయంలో ఇందిరా గాంధీ మరణవార్త తెలిసిందని ఎమోషన. ల్ అయ్యారు. బ్రతికి ఉన్న సమయంతో ఆమెను చూడలేకపోయానని దాంతో ఢిల్లీకి వెళ్లి ఆమె పార్దివదేహానికి నివాళులు ఆర్పించానని చెప్పారు.
Advertisement
అయితే ఆ సమయంలో పార్దివదేహం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ ఢిల్లీలో కొన్ని చోట్ల జరుగుతున్న అల్లర్ల గురించి తెలుసుకుని అక్కడకు వెళ్లి సిక్కులు హిందువులు ఒకరినొకరు చంపుకోకుండా నివారించారని వాళ్లను శాంతింపజేశారని చెప్పారు. కానీ మన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తన పదవి పోగానే విప్లవం వస్తుంది. జనం తిరుగుబాటు చేస్తారు..రక్తపాతం తప్పదని కామెంట్లు చేశారని…ఇలాంటి స్వార్దపరుడికి మనం ఓటువేయాలా…? లఏదలేదదంటే తల్లి చనిపోయినా కూడా ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తికి ఓటు వేయాలా మీరే తేల్చుకోండి అంటూ ప్రసంగించారు. నెహ్రై కుటుంబం దేశం కోసం తమ సంపదను దారపోసింది. దేశం కోసం ఎన్నో బాధలను భరించింది.
కానీ ఎన్టీఆర్ 200 కోట్లను సంపాదించి తన కుటుంబానికి అప్పగించి ఆ తరవాత రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. తుఫాన్ భీబత్సం కరువు సమయాల్లో మీరు ప్రజలకు ఏమిస్తారని ప్రశ్నిస్తే నా దగ్గర ఏముంది బూడిద తప్ప అన్నారు..కానీ ఆయన అకౌంట్ లో ఉన్నడబ్బులకే వడ్డీలు కూడా వస్తున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక కృష్ణ స్పీచ్ తో తిరుపతి సభ దద్దరిల్లింది. కృష్ణ విజయనిర్మల దంపతుల పై వారి అభిమానులు పూల వర్షం కురిపించారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కూడా కృష్ణను ప్రశంసించారు.
ALSO READ :
సీరియల్స్ లో కట్టిన చీరలు..వేసుకున్న బంగారం పడేస్తారా..?
“దోస్తీ” సాంగ్ లో జక్కన్న ఇచ్చిన హింట్ ను గమనించారా..?