Home » “దోస్తీ” సాంగ్ లో జక్కన్న ఇచ్చిన హింట్ ను గమనించారా..?

“దోస్తీ” సాంగ్ లో జక్కన్న ఇచ్చిన హింట్ ను గమనించారా..?

by AJAY
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలై అన్ని భాషల్లోనూ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దర్శకుడు రాజమౌళి పై ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

అంతేకాకుండా టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాలో కొన్ని సీన్లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న విధంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. అదేవిధంగా సినిమాలో జక్కన్న గ్రాఫిక్స్ చూసి ప్రేక్షకులు అబ్బురపడ్డారు. మరోవైపు ఈ సినిమాలో కొమురం భీముడో పాట, క్లైమాక్స్ ఫైట్ అదేవిధంగా ఎన్టీఆర్ బ్రిటిష్ కోటను బద్దలు కొట్టిన ఫైట్ హైలెట్ గా నిలిచాయి.

Advertisement

ఎన్టీఆర్ బ్రిటిష్ కోటను బద్దలు కొట్టడానికి జంతువులను తీసుకువెళ్లి వదిలినప్పుడే రామ్ చరణ్ కు బ్రిటిష్ తెల్లదొరల చేతిలో బందీగా ఉన్న పాప కోసం వచ్చింది ఎన్టీఆర్ అని తెలుస్తుంది. ఇక ఆ కోటలో ఎన్టీఆర్ పులులను మరి కొన్ని జంతువులను విడిచి పెట్టడమే హైలెట్ అని చెప్పాలి. అయితే ఈ సీన్ కంటే ముందు దోస్తీ పాట వస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ పాట వస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ తన భుజాలపై భారీగా మాంసాన్ని మూసుకువెళుతూ కనిపిస్తాడు.

అప్పుడు రామ్ చరణ్ తో పాటు పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సముద్రఖని ఎన్టీఆర్ ను ఉద్దేశించి వీడి ఆకలికి ఇది సరిపోతుందా అంటూ డైలాగ్ కొడతాడు. ఇక ఎన్టీఆర్ ఆ మాంసం తీసుకెళ్లి రాహుల్ రామకృష్ణకు ఇవ్వగా అతడు దాన్ని ఒక ఒక గదిలో పెట్టినట్టు కనిపిస్తుంది. ఇక రాజమౌళి ఎన్టీఆర్ మాంసాన్ని తీసుకు వెళ్ళింది జంతువుల కోసమే అని హింట్ ఇస్తాడు. కానీ ఈ సీన్ ను ఎవరూ అంచనా వేయలేదు.

Also read :

ఆ స్టార్ హీరో చేయాల్సిన “ఠాగూర్” సినిమాను చిరంజీవి లాక్కున్నారా..? తెరవెనక జరిగింది ఇదేనట..!

 

ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమా నుంచి చిరంజీవిని తీసేసి మోహన్ బాబు ఎందుకు ఎన్టీఆర్ పెట్టారు ? చిరు చేసిన తప్పు..!

Visitors Are Also Reading