మల్టీ స్టారర్ సినిమాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు హీరోలు నటిస్తారు కాబట్టి ఆ హీరోల అభిమానులు కూడా పండగ చేసుకుంటారు. అయితే మల్టీ స్టారర్స్ అంటే దర్శకనిర్మాతలకు రిస్క్ కూడా చాలానే ఉంటుంది. తమ హీరో పాత్ర తగ్గినా లేదా ఏదైనా తేడా కొట్టినా ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తక్కువగా ఉందని ఫ్యాన్స్ మండిపడిన సంగతి తెలిసిందే.
ALSO READ : చైనాలో పురుగుల వర్షం… ఏదైనా డ్రాగన్ సిటీకి సాధ్యం!
Advertisement
అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఫ్యాన్స్ ఆవేదన అర్థం అవుతుంది. కానీ ఒకప్పుడు కూడా ఫ్యాన్స్ అదే రేంజ్ లో అభిమానాన్ని చూపిస్తూ తమ ఫేవరెట్ హీరో విషయంలో తేడా వస్తే రచ్చరచ్చ చేసేవాళ్లు. ఇక కృష్ణ నాగార్జున నటించిన వారసుడు సినిమా విషయంలోనూ అలాంటి రచ్చనే జరిగింది. 1993లో వారసుడు సినిమా విడుదలైంది. అంతే కాకుండా ఈ సినిమా ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
Advertisement
దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా పెద్ద హీరోలతో సినిమా చేయడం ఈవీవీకి ఇదే మొదటి సినిమా. ఇక ఈ సినిమాను మురళీమోహన్ జయభేరి బ్యానర్ పై నిర్మించారు. మురళీమోహన్ కూడా పెద్ద హీరోలతో సినిమా చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నగ్మ నటించింది.
ALSO READ : సింగర్ సునీత భర్త మీకు తెలుసా.. ?
అంతే కాకుండా ఈ సినిమాలో రవితేజ స్టూడెంట్ పాత్రలో నటించగా హీరో శ్రీకాంత్ విలన్ గా నటించాడు. ఇక సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ కృష్ణ ఫ్యాన్స్ మాత్రం బగ్గుమన్నారు. సినిమాలో కృష్ణను నాగార్జున వాడు వీడు అనడం….కాలర్ పట్టుకోవడం, ఆయనకు తక్కువ ప్రియారిటీ ఇవ్వడం పై ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అక్కడితో ఊరుకోకుండా సినిమా ను ఆపేయాలని థియేటర్ ల ముందు ధర్మాకు దిగారు. దాంతో కృష్ణ ఫ్యాన్స్ కు సద్ది చెప్పారు. సినిమా చివరలో కృష్ణకు ఓ ఫైట్ పెట్టి మళ్లీ విడుదల చేశారు.
ALSO READ :ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?