ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన కొంత కాలం తర్వాత ఎన్టీఆర్ “బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర” షూటింగ్ ప్రారంభించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి సినిమాలు చేయడం ఏంటని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి జాతీయ స్థాయి నాయకులు వచ్చారు. ఇందులో బాలకృష్ణ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇక్కడే ఒక ట్విస్ట్ మొదలైంది. ఎన్టీఆర్ పాలనను ఆయన వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొన్ని చిత్రాలను నిర్మించారు. హీరో కృష్ణ అందులో ముఖ్య పాత్రలో ఉన్నారు. ఇక అదే సమయంలో బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర సినిమాకి పోటీగా కృష్ణ హిందీలో ఒక చిత్రాన్ని చేయాలని అది కూడా పద్మాలయ బ్యానర్ లో తీయాలని కృష్ణ నిర్ణయించుకున్నారట. ఆ టైం లో కృష్ణ ఎన్టీఆర్ మధ్య మంచి వార్ నడుస్తోంది.
Advertisement
also read:హీరో నాని ‘దసరా’కి ఎన్ని కోట్ల బిజినెస్ జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
Advertisement
ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని అది కూడా ఎన్టీఆర్ ఎక్కడ పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా నేను పోటీ చేస్తానని హీరో కృష్ణ ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ చిత్రానికి హిందీలో పోటీ గా ఉండడం కోసం హీరో కృష్ణ అమితాబ్ తో సినిమా చేయించాలని అనుకున్నారు. తన రాజకీయ పలుకుబడితో అమితాబ్ ను సినిమా కోసం ఒప్పించారు. ఆ టైంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ నిర్మిస్తున్న బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర హిందీ వర్షన్ లో దెబ్బ తీయడం కోసం కృష్ణ తీయబోయే ఈ చిత్రానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మద్దతు పలికింది. ఈ తరుణంలోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని శాసనసభ ఎన్నికల వరకు విడుదల చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారు. కానీ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల అనుకున్న సమయంలో సినిమా తీయలేకపోయాడు.
ఇక ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం అయింది. ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక చిత్రం ఇప్పట్లో విడుదల కాదని అందరూ భావించారు హీరో కృష్ణ కూడా అలాగే అనుకున్నారట. దీంతో అమితాబ్ తో ఆయన తీయాలనుకున్న సినిమా డ్రాఫ్ట్ చేశారు. కానీ అందరీ ఆలోచనలకు భిన్నంగా ఎన్టీఆర్ ఆలోచిస్తారు. ఆ తర్వాత అందరినీ ఏమార్చి ఆ చిత్రాన్ని విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ విధంగా కృష్ణ ఎన్టీఆర్ ను దెబ్బకొట్టాలని కుట్రపన్నారు.
also read: