రేపటి పరిస్థితి ఎలా ఉండనున్నదో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే కరోనా మహహ్మారి కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 01 నుంచి విద్యాసంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలలో రాత్రి కర్ప్యూను, వీకెండ్ లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. సినిమా నిర్మాతలు కూడా కాస్తతం ఊపిరి పీల్చుకుని ఆశావాహ దృక్పథంతో థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభం చేశారు. దాదాపు రెండేండ్ల క్రితం ప్రారంభం అయిన విడుదల కాకుండా ఆగిపోయి శ్రీకాంత్ కోతల రాయుడు సినిమా సైతం ఫిబ్రవరి 04 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల కాలంలోనే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్ పొందింది.
Advertisement
Advertisement
సుధీర్ రాజు దర్వకత్వంలో ఏ.ఎస్.కిషోర్ కొలన్ వెంకటేష్ నిర్మించిన కోతల రాయయుడుకు సునిల్ కశ్యప్ సంగీతం అందించాడు. శ్రీకాంత్ సరసన అందాల భామలు డింపుల్ చోప్డా నటాషా దోషి, ప్రాచీ సిన్హా నటించారు. మాటలతో మాయ చేసి పాత్రను శ్రీకాంత్ చేస్తున్నాడని అందుఏ కోతల రాయుడు అనే టైటిల్ పెట్టామని దర్శక, నిర్మాతలు పేర్కొంటున్నారు. గతంలో చిరంజీవి హీరోగానూ, కోతలరాయుడు పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. మరి అఖండలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన శ్రీకాంత్ ఇప్పుడు కోతల రాయుడులో ఏ విధంగా మెప్పించాడో చూడాలంటే ఫిబ్రవరి 04 వరకు ఆగాల్సిందే.