Home » Kotabommali PS Review : “కోట బొమ్మాళి” రివ్యూ.. థ్రిల్లింగ్ అదుర్స్‌ !

Kotabommali PS Review : “కోట బొమ్మాళి” రివ్యూ.. థ్రిల్లింగ్ అదుర్స్‌ !

by Bunty
Ad

 

Kotabommali PS Review : మన తెలుగు ఇండస్ట్రీలో అనేక రకాలైన సినిమాలు వస్తున్నాయి. హర్రర్‌, క్రైమ్‌ ఇలా ఎన్నో వస్తున్నాయి. అయితే.. ‘కోటబొమ్మాళి పిఎస్’ ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్, విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే ‘కోటబొమ్మాళి పిఎస్’. తేజ మర్ని తెరకెక్కించిన ఈ సినిమాను బన్నీ వాసు కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతమిచ్చారు. ఇందులో మురళీ శర్మ, దయానంద్ రెడ్డి తదితరులు కీలకపాత్రలో నటించారు.

Kotabommali PS Review

Kotabommali PS Review

కథ మరియు వివరణ :

Advertisement

‘కోటబొమ్మాళి పిఎస్’ కథ విషయానికి వస్తే ఒక ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక చిన్న కథ. అక్కడ నిర్దోషుల జీవితాలను ఎలా మలుపు తిప్పింది అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. పొలిటికల్ పంచులతో మంచి బోల్డ్ కంటెంట్ డైలాగ్స్ తో మూవీ బాగా కమర్షియల్ ఓరియంటెడ్ గా ఉంది. ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకులకు, పోలీసు వ్యవస్థకు మధ్య జరిగే అధికారిక పోరును ఈ సినిమాలో అద్భుతంగా ప్రదర్శించారు. రాజకీయ నాయకులు చొరవ చేసుకోవడం వల్ల కొంతమంది పోలీసులు ఎలా అనవసరంగా బలైపోతున్నారు అనే విషయాన్ని మూవీలో హైలెట్ చేశారు.

Advertisement

ఈ సినిమాలో శ్రీకాంత్ పేరు రామకృష్ణ. ఆయన ఒక హెడ్ కానిస్టేబుల్. పొలిటికల్ లీడర్స్ పోలీసులను ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేదే ఈ సినిమా కథ అని చెప్పుకోవచ్చు. అలాగే పోలీసులే ఈ సినిమాలో మరికొందరు పోలీసులకు విలన్లు అవుతారు. అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఈ సినిమా స్పష్టంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ సినిమా కథను మలయాళం సినిమా నయట్టు నుంచి తీసి రాసుకున్నారు. కాకపోతే కొన్ని మార్పులు చేశారు. ఈ సినిమాలో పోలీసులే పోలీసులను చేజ్ చేస్తుంటారు. ఇక ఈ సినిమా స్టోరీ పూర్తిగా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

కథ
లింగి లింగి లింగిడి సాంగ్
శ్రీకాంత్, రాహుల్, శివాని

మైనస్ పాయింట్స్ :

సాగదీత సీన్స్
లాజిక్ మిస్సింగ్‌

రేటింగ్‌ 2/5

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading