టీమిండియయా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్యకాలంలో అంతగా ఫామ్‌లో లేడనే చెప్పవచ్చు. ఇన్ని రోజులు సెంచరీలు చేయకపోయిన కనీసం హాఫ్ సెంచరీలు అయిన చేస్తున్నాడని అభిమానులు కాస్త భరోసాతో ఉన్నారు. త్వరలోనే సెంచరీ సాధించి మరల ఫామ్‌లోకి అందుకుంటాడని ఆశించారు. తాజాగా శ్రీలంకతో సిరిస్‌లో విరాట్ కోహ్లీ విఫలం అవ్వడంతో ఈసారి అతని కెరీర్ సగటుపై కూడా ప్రభావం చూపించింది. టెస్ట్ కెరీర్ లో కోహ్లీ సగటు 50కి కిందికే పడిపోయింది. ఇన్నాళ్లు 3 ఫార్మాట్లలో కలిపి 50 కి పైగా సగటుతో ఉన్న కోహ్లీ ప్రస్తుతం ఆ ఘనతకు దూరమయ్యాడు.
Advertisement
ముఖ్యంగా శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లో విఫలం కావడంతో అతని కెరీర్ సగటు 50కి దిగువకు పడిపోయింది. కోహ్లీ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 23, సెకండ్ ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసాడు. ఈ టెస్ట్‌లో కోహ్లీ 43 పరుగులు చేసి ఉంటే అతని సగటు 50కి పైగానే ఉండేది. కోహ్లీ 36 పరుగులే చేయడంలో టెస్ట్ క్రికెట్‌లో ఐదేళ్ల తరువాత అతని సగటు 50 లోపలికి పడిపోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ సగటు 49.96 గా ఉన్నది. 2017లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ సగటు 50 నుంచి 49.55 దిగజారింది.
Advertisement
తాజాగా అదే శ్రీలంకతో కోహ్లీ సగటు మళ్లీ 49కి దిగజారింది. ఇప్పటివరకు 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన విరాట్ 49.96 సగటుతో 8043 పరుగులు చేశాడు. టీమిండియా మళ్లీ జులై వరకు టెస్ట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోవడంతో అప్పటివరకు కోహ్లీ సగటు 49 ఉండనుంది. టెస్ట్ క్రికెట్‌లో సగటు 49 కి పడిపోయినప్పటికీ కోహ్లీ సగటు 50కి పైగానే ఉన్నది. వన్డేల్లో కోహ్లీ సగటు 58గా టీ-20లలో 51గా ఉంది. ఇప్పటివరకు 260 వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 51 సగటుతో 12,311 పరుగులు చేశాడు.
43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 97 టీ20 మ్యాచ్‌లు ఆడి 51 సగటుతో 3296 పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ చివరి సారిగా 2019 నవంబర్‌లో సెంచరీ సాధించాడు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.