Home » అమ్మాయిలు ఇచ్చే సిగ్న‌ల్స్ బ‌ట్టి వారి ఆలోచ‌న‌లు తెలుసుకోవ‌చ్చ‌ట‌..కానీ అలా సిగ్న‌ల్ ఇస్తే మాత్రం..!

అమ్మాయిలు ఇచ్చే సిగ్న‌ల్స్ బ‌ట్టి వారి ఆలోచ‌న‌లు తెలుసుకోవ‌చ్చ‌ట‌..కానీ అలా సిగ్న‌ల్ ఇస్తే మాత్రం..!

by AJAY
Ad

ఓ సినిమాలో అబ్బాయిలు ఆటోల్లాంటి వాళ్లు ఒక‌టి పోతే వంద వ‌స్తాయి. కానీ అమ్మాయిలు ఆర్టీసీ బ‌స్సుల్లాంటి వాళ్లు ఒక‌టి పోతే మళ్లీ రావు అనే డైలాగు ఉంటుంది. అయితే అది ప్రాక్టిక‌ల్ గా కూడా నిజమనే చెప్పాలి. సినిమాల్లోనే కాకుండా బ‌య‌ట ప్ర‌పంచంలో కూడా ఒక అబ్బాయి అమ్మాయి మ‌న‌సు దోచుకోవాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. కానీ అదే అమ్మాయి అబ్బాయిని ప్రేమ‌లో ప‌డేయాలంటే ఒక్క చూపు చాలు జీవితాంతం కుక్క‌లా తోక ఊపుతూ వెళ‌తాడు.

Advertisement

అయితే కొన్ని టిప్స్ పాటిస్తే అమ్మాయిల‌ను ప‌డేయ‌డం కూడా చాలా ఈజీ అని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…అయితే ఏ అమ్మాయిని అయినా ప‌డేయ‌డానికి ఈ టిప్స్ ప‌నిచేయ‌వు. కేవ‌లం మీ అర్హ‌త‌లు కు ప‌డే అమ్మాయిలు మాత్రమే ఈ టిప్స్ తో పడిపోతారు. సాధార‌ణంగా అమ్మాయిలు అబ్బాయిల‌ను చూసే విధానం ద్వారానే వాళ్లు పడిపోతారా లేదా అనే విష‌యాల‌ను తెలుసుకోచ్చు.

Advertisement

అమ్మాయిలు ఇచ్చే సిగ్న‌ల్ ద్వారానే వాళ్ల‌కు ఇష్టం ఉందా లేదా అని తెల‌సుకోవ‌చ్చు. అబ్బాయి ఏం చెప్పినా అమ్మాయి న‌వ్వుతుంది అంటే అప్ప‌టికే ప‌డిపోయిన‌ట్టు అర్థం. ఒకవేళ కోపంగా చూస్తే మాత్రం కొన్ని ప్ర‌య‌త్నాలు చేయ‌వ‌చ్చు. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయ‌డానికి ఆమెకు న‌చ్చిన ప‌నులు చేయాలి. జోక్స్ వేయాలి. ఎప్పుడూ న‌వ్వించే అబ్బాయిల‌ను అమ్మాయిలు ఇష్ట‌ప‌డారు. కాబ‌ట్టి జోకులు వేస్తూ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. అంతే కాకుండా గౌర‌వం ఇచ్చే అబ్బాయిల‌ను అమ్మాయిలు ఇష్ట‌ప‌డ‌తారు.

కాబ‌ట్టి అమ్మాయి త‌మ‌తో మాట్లాడిన్పుడు వారికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. ఇక అమ్మాయికి అస్స‌లు ఇష్టం లేక‌పోతే వారు విసుగు చెందిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తారు. అలాంటి వారిని ఇబ్బంది పెట్ట‌కూడదు. ఎందుకంటే అలాంటి అమ్మాయిలు ఎంతప్ర‌య‌త్నించినా ప‌డే ఛాన్స్ అస్స‌లు లేదు. అయితే మొత్తానికి మాత్రం అమ్మాయి ఇష్ట‌మే ఫైన‌ల్..కాబ‌ట్టి ఆమెకు ఇష్టం లేకుండా వెంట‌ప‌డ‌టం లాంటివి మాత్రం అస్స‌లు చేయ‌కూడ‌దు.

ALSO READ : Pulsar 150 బైక్ ను బ్యాన్ చేసిన బజాజ్.. మరి ఆ స్థానములో వచ్చిన బైక్ ఏదో తెలుసా?

Visitors Are Also Reading