ఐపీఎల్ 2022 మెగావేలంలో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ పింఛన్ ఒకరు. ఫామ్‌లేమి, వయస్సు పైబడిన దృష్ట్యా ఏ ఫ్రాంచైజీ అతన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ జట్టు నుంచి అనూహ్యంగా జట్టు నుంచి తప్పుకోవడంతో పింఛ్కు ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చే లక్కీ ఛాన్స్ దక్కినది.
ఫించ్‌ను కేకేఆర్ రూ.1.5 కోట్ల బేస్ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. గతంలో ఏకంగా 8 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆడిన రికార్డు ఉన్న 35 ఏళ్ల ఫించ్ సీజన్లో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఫించ్ ఐపీఎల్ కెరీర్లో 87 మ్యాచ్‌లను ఆడాడు. అయితే 25.7 సగటున 127.7 స్ట్రెయిక్ రేట్‌తో 2005 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం ఆసిస్ వన్డే, టీ20 జట్లకు నాయకత్వం వహిస్తున్న ఫించ్ ఐపీఎల్ ప్రారంభ సమయానికి పాకిస్తాన్ పర్యటనలో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 06 వరకు ఆసీస్, పాక్‌తో 3 వన్డేలు, ఏకైక టీ-20 ఆడాల్సి ఉంది.