బిగ్ బాస్ హౌస్ ఓ రియాల్టీ షో. ఈ షో ఇప్పటికే 6 సీజన్లు పూర్తిచేసుకుని ఏడవ సీజన్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ షో 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమై… ఇప్పుడు కేవలం 10మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ షో నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నాల్గవ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ రతికా రోజ్. మొదటి రోజే చూడడానికి చురుగ్గా, చాలా అందంగా, అమాయకంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ చాలా రోజులు బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవుతుందని అందరూ భావించారు.
రెండవ రోజు నుంచి తన అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది. కొందరు ఈ హౌస్ లో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకొని మారుతుంటారు. మరికొందరేమో ఇలాంటి కఠినమైన ప్రవర్తనతో ప్రేక్షకుల్లో చెడుగా ముద్ర వేసుకుంటారు. అలాంటి కోవలోకే రతిక రోజ్ చేరింది. అమ్మాయి అంటే ఇలా అస్సలు ఉండకూడదు, వెన్నుపోట్లు ఎలా పొడవాలో ఆమెను చూసి నేర్చుకోవచ్చని ప్రేక్షకులు భావించారు. ఇక ఈమెపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ట్రోలింగ్ ఎక్కడివరకు వెళ్లిందంటే హీరో కిరణ్ అబ్బవరం వరకు వెళ్ళింది. ఈ హీరో తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’.
Advertisement
Advertisement
ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా కిరణ్ తాజాగా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపిగ్గా సమాధానాలు ఇచ్చాడు కిరణ్. ఈ క్రమంలోనే ఓ అభిమాని రూల్స్ రంజన్ సినిమా హిట్ అయ్యాక మీకు రతిక లాంటి అమ్మాయితో వివాహం జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు. దీంతో కిరణ్ నా మీద ఎందుకంత పగ… పెళ్లి అయితే చేసుకుంటాను కానీ ఎలాంటి అమ్మాయి వస్తుందో చెప్పలేము అని అన్నాడు.
ఇవి కూడా చదవండి
- సమంత -నాగచైతన్య రహస్యంగా కలిశారా..? ఇదిగో ఇదే ప్రూఫ్ !
- MS Dhoni : చరణ్-ధోని కాంబోలో పాన్ ఇండియా మూవీ !
- ఇండియా వర్సెస్ పాక్ మధ్య సరికొత్త సిరీస్… గాంధీ-జిన్నా ట్రోఫీ పేరుతో ?