ఒకప్పటి జబర్దస్త్ కమెడీయన్ కిరాక్ ఆర్పీ, జబర్దస్త్ యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వారు ఎలాంటి వాళ్లో ఓపెన్ గా చెప్పాడు. జబర్దస్త్ సక్సెస్ లో యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయలకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. వీరిద్దరూ ట్రెండ్ సెట్టర్స్. 2013లో కామెడీ షో ప్రయోగాత్మకంగా ప్రారంభం అయింది. రోజా, నాగబాబు జడ్జెస్ గా అనసూయ యాంకర్ గా కొందరూ వెండితెర కమెడీయన్స్ టీమ్ లీడర్స్ గా షో ప్రారంభించారు.
Advertisement
జబర్దస్త్ యాంకర్ గా అనసూయ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసింది. ముఖ్యంగా పొట్టి దుస్తులతో గ్లామరస్ గా కనిపించేది. గతంలో ఏ తెలుగు యాంకర్ అలా చేయలేదు. ఈ తరుణంలో విమర్శలు తలెత్తాయి. అలాగే ఆమెకు భారీ పాపులారిటీ దక్కింది. వ్యక్తిగత కారణాలతో అనసూయ తప్పుకోగా.. రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. అనసూయను రష్మీని ఫాలో అయింది. ఆమెకు కూడా పొట్టి దుస్తులతో ఆడియన్స్ ని ఉత్తేజపరిచింది. అనసూయ రీ ఎంట్రీ ఇవ్వగా.. రష్మీతో ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అనసూయ తప్పుకోగా రష్మీ గౌతమ్ కొనసాగుతుంది. ఏళ్ల తరబడి జబర్దస్త్ లో కమెడియన్ గా ఉన్న కిరాక్ ఆర్పీ, రష్మీ గౌతమ్, అనసూయ ఎలాంటి వాళ్లు చెప్పుకొచ్చాడు.
Advertisement
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రష్మి అప్పటి వరకు ఉన్న యాంకర్స్ స్థాయికి మించిన యాంకర్. ఆమెకు తెలుగు సరిగ్గా రాదు. భాష రాకుండా తనకు వచ్చిన స్లాంగ్ తో సక్సెస్ అయింది. ఆమె తెలుగు కి బదులు తెగులు అన్నా కూడా నవ్వుకుంటామని చెప్పాడు. ఇక అనసూయ సినిమాల్లో ప్రత్యేక క్యారెక్టర్స్ తో తన స్థాయిని పెంచుకుంది. ఆమెకు సినిమాలకు కూడా బాగా సెది సుధీర్ మల్టీ టాలెంటేడ్ అని, గెటప్ శ్రీను కమల్ హాసన్ అని, రామ్ ప్రసాద్ ఆటో డైలాగ్స్ కి ఫేమస్ అంటూ కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : హీరోయిన్ పై చేయి చేసుకున్న దర్శకుడు.. క్లారిటీ ఇదే..!