కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో కిచ్చా సుదీప్ పాపులర్ అయ్యాడు. ఆ సినిమాలో విలన్ గా నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే విక్రాంత్ రోనా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కిచ్చా సుదీప్. అయితే తాజాగా… ఈ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
read also : Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?
Advertisement
ఇవాళ భారతీయ జనతా పార్టీలో సుదీప్ చేరుతున్నారని సమాచారం అందుతోంది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఇవాళ బీజేపీ పార్టీలో సుదీప్ చేరుతున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తో పార్టీ నేతల సమక్షంలో బిజెపిలో కిచ్చా సుదీప్ చేరతారని జోరుగా ప్రచారం అయితే అందుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీప్ చేరతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
కానీ ఇప్పుడు బీజేపీలో చేరుతారని చెబుతున్నారు. కాగా మే 10వ తేదీన కర్ణాటకలో ఓకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుతం కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. తాజాగా వస్తున్న సర్వేల ప్రకారం బిజెపి పార్టీ ఓడిపోతుందని తేలింది. ఈ తరుణంలోనే కీలక వ్యక్తులను తమ పార్టీలో చేర్చుకుంటుంది బిజెపి. ఇందులో భాగంగానే కిచ్చా సుదీప్ ను బిజెపిలోకి ఆహ్వానించారు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
read also : IPL 2023 : సిక్సుతో కారు ధ్వంసం..గైక్వాడ్ కు రూ.5 లక్షల రివార్డు