Ad
కేజిఎఫ్ సినిమా అనేది మొత్తం దేశమంతగా పెద్ద సునామి సృష్టించింది అనే చెప్పాలి. ఏ అంచనాలు లేకుండా పాన్ ఇండియా విడుదల అయిన కేజిఎఫ్ మొదటి సినిమా పెద్ద హిట్ కావడంతో దీనిపైన అంచనాలు అనేవి పెరిగిపోయాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చారు. ఇక ఈ ఏడాది విడుదలైన కేజిఎఫ్ 2 సినిమా అనేది ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ వసూళ్లు చేసింది.
అయితే ఈ సినిమాలో ఓ నటుడు క్యాన్సర్ తో పోరాడుతూనే చేసాడు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కేజిఎఫ్ సినిమాలో హీరో రాఖీ భాయ్ పక్కన ఉండే ముస్లిం పెద్ద మనిషి పాత్రలో నటించిన హరీష్ రాయ్ కు క్యాన్సర్ అనే విషయం చాలా రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని తాజాగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు.
హరీష్ రాయ్ మాట్లాడుతూ.. నేను మూడేళ్ళుగా గొంతు క్యాన్సర్ తో భాధపడుతున్నాను. అయితే నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే.. చెప్తే నాకు అవకాశాలు రావు అని అనుకున్నాను. ఇక కేజిఎఫ్ 2 సినిమా ప్రారంభం కంటే ముందే నాకు క్యాన్సర్ వచ్చింది. అయితే ఈ సినిమాలో నేను మొత్తం గడ్డంతో కనిపించడానికి కూడా ఈ క్యాన్సర్ కారణం. దీని వల్ల నా గొంతు మొత్తం వాసింది. అందుకే దానిని కవర్ చేషు సినిమాలో గడ్డం కనిపించాను అని హరీష్ రాయ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
జెండాను వద్దన్న జై షా.. ఎందుకో తెలుసా..?
బాబర్ ఓపెనర్ గా వేస్ట్..!
Advertisement