Home » రిషబ్ పంత్ చెంప పగలగొడతా : కపిల్ దేవ్

రిషబ్ పంత్ చెంప పగలగొడతా : కపిల్ దేవ్

by Bunty
Ad

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్ లో ఢిల్లీ నుంచి వస్తుండగా రూర్కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా యాక్సిడెంట్ లో పంతుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడు ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఆసపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. దాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న పంత్ తన ఆరోగ్యం గురించి తాజాగా సమాచారం ఇచ్చాడు.

 

Advertisement

ఇదిలా ఉండగా, ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పైనే ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఎప్పుడో పంత్ సిరిస్ కు దూరమయ్యాడు. పంత్ లేని లోటు టీమిండియాలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెట్ సైతం అంటున్నారు కానీ టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ 1983 లో భారత్ కు తొలి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం పంత్ గురించి చాలా భిన్నంగా స్పందించారు.

Advertisement

రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్న తర్వాత వెళ్లి అతని చెంప పగలగొడతానని అన్నారు. కాపిల్ దేవ్ చేసిన ఈ కామెంట్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. అయితే కపిల్ చేసిన వాక్యాల వెనుక పంత్ పై కోపం కాదు, విపరీతమైన ప్రేమ ఉంది. కపిల్ మాట్లాడుతూ ‘రిషబ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, అతను కోరుకుంటే వెళ్లి ఒక్కటి పీకుతా. అందుకే ఇలాంటి తప్పు మళ్ళీ చేయకుండా అతని చెంప పగలగొట్టి చెబుతా. పంత్ లాంటి యువ క్రికెటర్లు టీమిండియాకు ఎంతో అవసరం. అతను లేకపోవడంతో ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా జట్టు కూర్పులో ఎంతో ఇబ్బంది పడుతోంది’ అని కపిల్ పేర్కొన్నారు.

READ ALSO : Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” ఓటిటి రిలీజ్ డేట్ పిక్స్..స్ట్రీమింగ్ ఎందులో అంటే !

Visitors Are Also Reading