కంగనా రనౌత్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇప్పుడు అక్కడ ఉన్నా అందరూ హీరోయిన్ల కంటే కంగనానే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని అందరికి తెలిసిందే. అందుకే ఆమెను బాలీవుడ్ క్వీన్ గా పిలుస్తుంటారు. అయితే కంగనా తన నటనతోనే కాకుండా మాటలతో కూడా వార్తలో నిలుస్తుంటుంది. ప్రతి విషయంలో బోల్డ్ గా మాట్లాడుతూ ఎవరిపైననైనా సరే తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంటుంది. అందువల్లే కొన్నిసార్లు విమర్శలో కూడా చిక్కుకుంటుంది. ఇప్పుడు కూడా అలానే చేసింది కంగనా.
Advertisement
తనకు సంబంధం లేను నుపూర్ శర్మ వివిధంపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. అయితే ఈ మధ్యే బీజేపీ పార్టీకి చెందిన నుపూర్ శర్మ మొహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కేవలం మన ఇండియాలోనే కాకుండా అన్ని ముస్లిం దేశాలు కూడా ఆ కామెంట్స్ పై సీరియస్ అయ్యాయి. అలాగే తమ దేశాలలో ఉన్న భారత రాయబార సంస్థలకు సమన్లు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో నుపూర్ ను బీజేపీ పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసారు. అయితే ఇప్పుడు ఈ వివాదంలోకి కంగనా వచ్చింది.
Advertisement
తాజాగా కంగనా తన సోషమ్ మీడియా అకౌంట్ లో ఈ విషయం పై స్పందిస్తూ.. అమిర్ ఖాన్ పీకే సినిమాలోని ఓ ఫోటోను జత చేసింది. అందులో అమిర్ శంకరుని వేషంలో ఉన్న ఓ వ్యతి వెనుక పడుతూ బాత్రూమ్ లో అతడిని పట్టుకొని తనకు సహాయం చేయాలనీ కొడుతుంటాడు. ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ… ఈ సిన్ వల్ల నేను ఇబ్బంది పడ్డాను. కానీ ఇది నాకు దేవుడిపై ఉన్న నమ్మకాన్ని పోగొటలేదు. సినిమాలలో మాత్రం చేసే వ్యాఖ్యలు, దేవుళ్లను ఎగతాళిగా చూపించే సన్నివేశాలు మనస్సులో నిజంగా ఆధ్యాత్మికత ఉన్నవారి నుండి ఆ భగవంతుడిని దూరం చేయలేవు అని రాసుకొచ్చింది. దాంతో కంగనా కామెంట్స్ పై మామూలుగానే అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :