ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు ఐపీఎల్ మ్యాచ్ లన్నియూ చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ తరుణంలో..హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జట్టు తాజా సీజన్ లో వరుసగా రెండో విజయం సాధించింది.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇది ఇలా ఉండగా, గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
read also : Rishabh Pant:కర్రలతో రిషబ్ పంత్ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్
Advertisement
అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో బంతిని ఆపబోయి కేన్ మామ తీవ్రంగా గాయపడ్డారు. అతని మోకాలికి తీవ్ర గాయం అయింది. ఇక ఐపిఎల్ కు దూరమైన విలియమ్సన్ స్వదేశానికి పయనం అయ్యాడు. అయితే కేన్ విలియమ్సన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Advertisement
ఇందులో మోకాళ్ళకి కట్టుతో కనిపిస్తున్న కేన్ మామ క్రట్చేసి (ఊత కర్రలు) సాయంతో నడుస్తున్నాడు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే విలియమ్సన్ అలా ఊత కర్రలు పట్టుకొని నడవడంపై ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. కేన్ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఎక్కువ రోజులు విశ్రాంతి అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023 లో విలియమ్సన్ ఆడడం అనుమానంగా మారింది.
#WATCH: Hear Kiwi cricketer Kane Williamson's first comments as he touches down in NZ, after a knee injury cut short his @IPL campaign https://t.co/j8QZegWvcu (Via @AlexChapmanNZ) pic.twitter.com/5GUnkugHXa
— Newshub (@NewshubNZ) April 3, 2023
READ ALSO : Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్