లలిత జ్యూవెలర్స్ అనగా మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు కిరణ్ కుమార్. ప్రధానంగా తన కంపెనీకి తానే ప్రచారం చేసుకునే విధానం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ముఖ్యంగా సినిమా, స్పోర్ట్స్, మోడల్స్ లాంటి స్టార్లు చేస్తేనే కమర్షియల్ యాడ్ సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని తలకిందులు చేస్తూ తన తెలివైన బిజినెస్‌మెన్ కిరణ్ కుమార్. లలిత జ్యూవెలర్స్ కంపెనీకి తానే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు షోరూంలు ఓపెన్ చేయగా.. తొలుత సోమాజిగూడలో, ఆ తరువాత కూకట్‌పల్లి, తదనంతరం దిల్‌సుఖ్‌నగర్ లలో షోరూంలను ప్రారంభించారు.
Advertisement
అత్యంత త్వరలోనే చందానగర్, సుచిత్ర సర్కిల్ వద్ద షోరూంలను ఓపెన్ చేయనున్నట్టు కిరణ్ చెబుతున్నారు. నిజామాబాద్ లో కూడా ఓ షోరూం ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వూలో లలితా జ్యూవెలరీకి లలితా అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించగా.. అందుకు సమాధానం కిరణ్ ఇలా చెప్పారు. 1999లో లలితా జ్యూవెలరీని నేను టేకోవర్ చేశానని.. నేను ఒరిజినల్ ఓనర్ ని కాదు. కందు స్వామి అనే అతను ఒరిజినల్ ఓనర్. అతని వద్ద నుంచి తాను టేకొవర్ చేసినట్టు చెప్పుకొచ్చారు.
Advertisement
మరోవైపు లలితా జ్యూవెలరీస్ అనగా జయలలిత సంబంధించినవని అప్పట్లో రూమర్స్ వినిపించేవి దానిపై మీరు ఏమంటారని ప్రశ్నించగా.. ఎవరు ఏమైనా అనుకొని నాకు సంబంధం లేదని పేర్కొన్నారు. సోనియా అంటే సోనియాగాంధీది అనేవారు. మోడీ జ్యూవెలరీస్ అంటే నరేంద్ర మోడీ అని అనుకునేవారు. అసలు పొలిటిషన్స్ కి మనకు సంబంధమే లేదు. తాను ఫస్ట్ షోరూం ఆంధ్రా నుంచి మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ 42 షోరూంలున్నాయి. త్వరలో 180 షోరూంలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాను. అదేవిధంగా ఉత్తరభారతదేశంలో కూడా షోరూంలను ప్రారంభించాలనుకుంటున్నాం. భారతదేశం అంతటా 450 షోరూంలు ఏర్పాటు చేయాలనే ప్లాన్ ఉంది. నాలుగైదు సంవత్సరాల్లో అది పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు కిరణ్ కుమార్.
Also Read :
కెరీర్ లో ఫ్లాప్ చూడని 7గురు టాలెంటెడ్ దర్శకులు వీళ్లే..!
మీకు నిద్ర పడుతుందా..? చక్కటి నిద్రకు చిట్కాలు ఇవే..!